ఎన్ని చట్టాలు వచ్చిన... ఎన్ని ఎన్కౌంటర్లు జరిగిన... ఎన్ని శిక్షలు వేసిన సరే.. ఆడవారిపై అఘాయిత్యాలు ఆగవు. ఇవి ఎప్పటికి మారవు.. పోలీసులు అయినా ఎం చేస్తారు.. ఎంతమందిని అని కాపాడుతారు. ఎక్కడ చుసిన ఇవే ఘటనలు. తెలంగాణాలో అయితే మరి ఎక్కువ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలను ఎవరు ఆపలేకపోతున్నారు.

                       

ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఎంఈవో కార్యాలయానికి ఓ ఉపాధ్యాయురాలు కిరోసిన్ బాటిల్ తో వచ్చింది. ఆలా వచ్చింది అని ఎవరిపైనో కిరోసిన్ పోసి చంపడానికి కాదు.. ఆమెను ఆమె ఆత్మహుతి చేసుకోడానికి వచ్చింద. ఎంఈవో కార్యాలయం ఎదుట తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది అయితే అక్కడే ఉన్న సిబ్బంది, స్థానికులు ఆమెను అడ్డుకున్నారు.

                        

దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో తాను ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నానని, తనపేరు రాంభాయి అని ఆమె తెలిపింది. తాను పని చేస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

                        

అయితే ఆమె పాఠశాలలో చేసుకోవాలి అనుకుంది అని కానీ పిల్లలు ఉండటంతో ఇక్కడకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రధానోపాధ్యాయుడు ఎందుకు ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు.. అతను ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: