ఈరోజు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపించిన ఒక లెటర్ ను స్పీకర్ తమ్మినేని సీతారాం నిండు సభలో చదివారు.

లెటర్ లో... 'డిసెంబర్ 13న ఏపీ అసెంబ్లీ శాసనసభలో ఆమోదం పొందిన దిశ బిల్లు/చట్టంను దేశమంతా ప్రశంసిస్తున్నారు. ఈ విషయాన్ని నేను సంతోషంగా చెప్తున్నాను. మమ్మల్ని దిశ బిల్లు కాపీలను పంపించమని ఢిల్లీ ప్రభుత్వం కూడా కోరుకున్నది. చారిత్రాత్మకమైన దిశ బిల్లును తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నా అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా... ఇటువంటి గొప్ప బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ హౌజ్ లోని ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుతున్నాను.' అని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ అసెంబ్లీ కు లెటర్ రాశారు.


లెటర్ స్పీకర్ చదువుతున్నంతసేపూ.. జై జగన్ జై జై జగన్ అంటూ అసెంబ్లీ హౌజ్ అంతా మారుమ్రోగింది. నిజానికి... దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు దిశ చట్టం తీసుకు వచ్చిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. మహిళలను పిల్లలను లైంగికంగా వేధించిన వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దేశంలోని మహిళా సంఘాల అధికారులు కొంతమంది నిరాహార దీక్ష చేస్తూ దిశ చట్టం అన్ని ప్రాంతాలలో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి

 

ఆంధ్రప్రదేశ్లోని మహిళలంతా జగన్మోహన్ రెడ్డికి.. ఇటువంటి విప్లవాత్మక బిల్లును తీసుకువచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ... కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దిశ తండ్రి కూడా... బిల్లు పాస్ అయిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంకు, జగన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేరం చేసింది ఎటువంటి వాడైనా, ఎంతటి వాడికైనా శిక్షవిధిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డికి అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: