హైదరాబాద్ షాద్ నగర్  వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం అమాయకురాలైన వైద్యురాలును  అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో  దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో దిశా కేసులోని నిందితులకు  ఉరి శిక్ష పడాలని నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో  నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు  తెలంగాణ పోలీసులు. తమ నుంచి నిందితుల పారిపోయేందుకు ప్రయత్నించారని   తుపాకులతో దాడి చేసేందుకు యత్నించగా తప్పని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ నిందితుల ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చారు. అయితే దిశ కేసులోని నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై దేశం మొత్తం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

 

 ఆడ పిల్లలపై అత్యాచారాలు చేసే వారికి ఇలాంటి శిక్షలు పడాలంటే ఎన్కౌంటర్ ను కొంతమంది   సమర్థిస్తూ ఉంటే...  ఇంకొంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని.. నిందితుల ఎన్కౌంటర్ చేశారు అని  ఎన్కౌంటర్ వ్యతిరేకిస్తున్నారు . కాగా  ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిందితుల ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అటు ఈ కేసులో నిందితుల ఎన్కౌంటర్ చట్ట విరుద్ధమంటూ.. సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టు నిందితుల  ఎన్కౌంటర్పై విచారించేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 

 

 

 

 ఇలా ఉండగా దిశా  ఎన్ కౌంటర్ ముమ్మాటికీ చట్ట విరుద్ధం అంటూ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎన్కౌంటర్ ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో  తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. నిందితుల ఎన్కౌంటర్లో వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసు ల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ... సామాజిక కార్యకర్త సజయ  పిటిషన్ దాఖలు చేశారు తాజాగా నిందితుల ఎన్కౌంటర్ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై అన్ని  పిటిషన్లతో  పాటే విచారణ జరిపనుంది  సుప్రీంకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: