ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో జగన్, చంద్రబాబు మద్య మాటల యుద్ధం తీవ్రంగా సాగింది. అప్పులు చేసింది ఎవరో తప్పులు చేసేది ఎవరో తెలుసుకోలేని స్దితిలో ప్రజలు లేరు. ప్రజా సమస్యలపై చర్చల కంటే ఒకరినొకరు పరువు తీసుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తున్నట్లుగా కనిపిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ రోజు అసెంబ్లీలో జరిగిన వార్ ఏంటో తెలుసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

 

ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నోరు తెరిస్తే చాలు దారుణంగా అబద్ధాలు బయటకు వస్తాయని మండిపడ్డారు.. అదీగాక టీడీపీ సభ్యులు చంద్రబాబు మాట్లాడుతు ఉన్నంత సేపు  గొడవలు చేయలేదు కానీ.. సీఎం మాట్లాడుతుంటే అడ్డుకునే యత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు లాంటి నాయకుడా మనకు కావాల్సింది..?. ప్రతిపక్షనేతగా కూడా చంద్రబాబుకు ఉండే అర్హత లేదు. చారిత్రాత్మక బిల్లు తెస్తుంటే టీడీపీ సభ్యులు బఫూన్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు.

 

 

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారు. ఓట్ల కోసం కులాలే కాదు.. అన్న దమ్ములను చీల్చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు ఎస్సీ..ఎస్టీ ద్రోహి అంటూ మండిపడ్డారు. ఎవరెన్ని విధాలుగా అడ్డువచ్చిన నా ప్రతి అడుగు పేదవారికి తోడుగా ఉంటుంది’ అని జగన్ తెలిపారు. ఇకపోతే ఈ వాఖ్యలపై బాబు స్పందిస్తూ ఎస్సీ, ఎస్టీలకు  టీడీపీనే రూ.10 వేల కోట్లు కేటాయించి, న్యాయం చేసింది. కానీ ఈ విషయంలో సీఎం జగన్‌ కావాలనే రెచ్చగొడుతున్నారు. నేను అనని మాటల్ని అన్నట్లు చూపిస్తున్నారు. గుంటూరులో ఎస్సీ మహిళపై అత్యాచారానికి సమాధానం చెప్పాలి.. ఇక ప్రివిలేజ్‌ నోటీసుపై చర్చించకుండా జగన్‌ పారిపోయారు’ అని విమర్శించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: