ప్రస్తుత కాలపు మనిషి అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, రోజురోజుకు తన ప్రతిభను తెలివితేటలను పెంచుకుంటూ ముందుకు పోతున్నప్పటికీ, మనలోని కొందరు మృగాళ్లు మాత్రం, తప్పుడు ఆలోచనలతో అభం శుభం తెలియని అమాయకమైన ఆడపిల్లల్ని దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తున్న ఘటనలు మాత్రం మన మానవ జాతికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ విధంగా అమ్మాయిలపై రేప్ లు మరియు హత్యలు జరుగుతూ పోతుంటే, రాబోయే రోజుల్లో అమ్మాయిలను మ్యూజియం లో చూడవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయని పలువురు మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ షాద్ నగర్ ప్రాంతంలో లేడీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ అనే నలుగురు నిందితులు ఘోరంగా రేప్ కు పాల్పడి, అనంతరం ఆమెను హింసించి చంపేసిన ఘటనను మనం ఎప్పటికీ మరచిపోలేము. ఇక ఆ ఘటన జరిగిన కేవలం పది రోజుల్లోనే ఒక సందర్భంలో నిందితులు తమపై రాళ్లు రువ్వి పారిపోతుండగా, పోలీసులు వెంటనే వారిపై కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కాగా ఆ ఘటనలో నలుగురు నిందితులు కూడా చనిపోయారు. కాగా ఈ మొత్తం ఘటనకు అసలు సూత్రధారి ఎవరు అనే దానిపై పలు భిన్న వాదనలు వినపడుతున్నప్పటికీ, వారిలో డ్రైవర్ గా ఉన్న ఆరిఫ్ బాషానే అసలు కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చినట్లు సమాచారం. ముందుగా అతడే ప్రియాంకను చూడడం జరిగిందని, 

 

ఆ తరువాత మిగతా ముగ్గురు నిందితులతో కలిసి ప్లాన్ చేసి ఆమెపై అత్యాచారం, దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అందుకే అతడిని పోలీసులు ఏ1 గా నిర్ణయించినట్టు సమాచారం. కేవలం క్షణిక సుఖం కోసం ఒక అమ్మాయిపై అంత పైశాచికంగా ప్రవర్తించే ముందు, ఆ నీచులకు తమ కుటుంబంలోని ఆడపిల్లలు గుర్తకు రాలేదా, కేవలం వారివే కుటుంబాలా, మిగతావారివి కావా అంటూ పలు మహిళా సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎంత బాధ పడ్డా చనిపోయిన ప్రియాంక తిరిగి రాదని, కావున ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచి ఇటువంటి దారుణాలు ఇకపై జరుగకుండా గట్టిగా చర్యలు చేపట్టాలని, అలానే ఇటువంటి వాటికి శిక్షలు మరింత కఠినతరం చేయాలని కూడా వారు కోరుతున్నారు.......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: