పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ, పౌరసత్వ సవరణ చట్టం ఇలా సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న నరేంద్ర మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం ఏర్పాటుపై బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా తన మాట నిలబెట్టుకుంది, ఇక అలాగే జమ్మూ కాశ్మీర్ కు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని ప్రకటించిన నరేంద్ర మోడీ, ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేశారు జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి సంచలనం సృష్టించింది. అలాగే ఎన్నికల్లో తాను ఇచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకుంటామని బీజేపీ చెబుతోంది.

 

కేంద్ర ప్రభుత్వం మరో సంచలనానికి సిద్ధం అయినట్లు సమాచారం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రాంతీయ పార్టీలను అనర్హులుగా ప్రకటించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే జాతీయ పార్టీ తప్పనిసరి అంటూ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీలు తమ ఇష్టా రీతిన వ్యవహరిస్తుండడంతో ప్రాంతీయ పార్టీలను లోక్‌సభ ఎన్నికలకు దూరం చెయ్యాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తమ ఉనికి కోల్పోనున్నాయి. అయితే అతి సున్నితమైన ఈ అంశంపై కాంగ్రెస్ తమ మద్దతు తెలుపనున్నట్లు సమాచారం, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల వల్ల కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లుతూ వస్తోంది. 

 

మోడీ సర్కార్ లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయడానికి కేవలం జాతీయ పార్టీలను మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెసుకు లాభించే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండనందున జాతీయ పార్టీలకు తమ మద్దతు తెలపాల్సి ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాజ్యాంగా సవరణ చేయాలంటే పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: