అయేషా మీరా.. దాదాపు 12 సంవత్సరాల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా, పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో సత్యం బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. 

 

అయితే ఇప్పుడు మళ్ళి అయేషా మీరా కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. గత శనివారం కోర్టు అనుమతితో రీపోస్టుమార్టం నిర్వహించారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య పర్యవేక్షణలో ఫోరెన్సిక్‌ నిపుణులు అవశేషాలను పరిశీలించారు. ఎముకలు, జుట్టు, గోళ్లను తీసుకొని పరిశీలించి ఫోరెన్సిక్‌ బృందం రిపోర్ట్ తయారు చేసింది. 

 

ఒకవైపు ఇలా కేసు విచారణ, రీపోస్టుమార్టం జరుగుతుంటే అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. గత శనివారం సీఎం జగన్, ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చెయ్యగా.. ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. అయేషా మీరా హత్య కేసును మాఫీ చేసింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

 

అయేషా మీరా తల్లి మాట్లాడుతూ.. తండ్రి కేసు మాఫీ చేస్తే ఇప్పుడు ఆయన కొడుకు జగన్ దిశ చట్టం అంటున్నారని.. పోలీసులు, ప్రభుత్వం కేసులు పెట్టిన బాధితులనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని అయేషా మీరా తల్లి ఆరోపించారు. ఆడపిల్లలను కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. 

 

కాగా ఆమె మాట్లడుతూ.. బ్రిటిష్ వాళ్లు మళ్లీ వచ్చి పరిపాలిస్తే గానీ దేశం బాగుపడదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదని, విద్యా సంస్థలు సరిగా లేవని, రాజకీయ వ్యవస్థ ఏవి సరిగా లేవని అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సంచలన వ్యాఖ్యలు ఎవరో ప్రతిపక్ష నాయకులూ వెనుక ఉండి మాట్లాడిస్తున్నారని కొందరు రాజకీయ నాయకులూ అభిప్రాయపడ్డారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: