పైనున్న శీర్షిక మేము సొంతంగా రాసింది కాదు. నిజానికి అది రాజకీయ పండితులు అంటున్న మాట. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవడానికి భాజాపా పరోక్షంగా అంతో ఇంతో సహాయం చేసింది. అయితే అటువంటి భాజపాకు అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మింగుడుపడని నిర్ణయాలను జగన్ తీసుకున్నారట. దాంతో కేంద్రం నుంచి అనవసరమైన కష్టాలను జగన్ కొనితెచ్చుకోబోతున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... భారతీయ జనతా పార్టీకి, వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య దూరం క్రమ క్రమంగా పెరుగుతూ పోతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గురించి పలు అంశాలు ప్రస్తావించడానికి జగన్ ఢిల్లీకి కొన్నిసార్లు వెళ్తే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి కూడా అపాయింట్మెంట్  ఇవ్వలేదు. కానీ వైసిపి ఎంపీ రఘురామ కృష్నం రాజుకు మాత్రం అపాయింట్ మెంట్ ఇచ్చారు. సో, కావాలనే జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎన్నో నిరాధారక కథనాలు వచ్చాయి. కానీ అసలైన నిజం ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఆ విషయం పక్కన పెడితే.. ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయం.. అమిత్ షాను రెచ్చగొట్టేలా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 


ఆ నిర్ణయం ఏంటంటే,  జగన్.. మనీష్ కుమార్ సిన్హాని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం. జగన్ కొత్తగా పాలనలోకి వచ్చినప్పుడు ముత్యాల స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలని అనుకున్నారు. కానీ అందుకు కేంద్రం మాత్రం ససేమిరా అన్నది. ఇందువల్ల, కుమార్ విశ్వజిత్‌కు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు జగన్. కానీ ఆరు నెలల తర్వాత ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ విశ్వజిత్ రిలీవ్ అయ్యారు. దాంతో 2000 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించారు జగన్.




అయితే ఈ మనీష్ కుమార్ సిన్హా కు, అమిత్ షాకు అస్సలు పడదు. కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షా పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించింది మరెవరో కాదు ప్రస్తుత ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ మనీష్ కుమార్. గతంలో అమిత్ షాకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి మనీష్ కుమార్ కు డిజిపి స్థాయి పదవిని జగన్ కావాలనే ఇచ్చారని రాజకీయ నేతలు అంటున్నారు. అమిత్ షా జగన్ పట్ల సరైన వైఖరి చూపించకపోవడంతో... విసిగి పోయిన జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆ పార్టీలో ఉన్న నేతలు ఈ నిర్ణయం వల్ల వచ్చేది ఏమీ లేదు కానీ... అమిత్ షాని కవ్విచడంతో కేంద్రం నుంచి మరిన్ని కష్టాలు వస్తాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: