గ్రామీణ అభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ బుచ్చయ్య చౌదరి మాటలకు స్పందించారు. వైసీపీ ఇసుక పాలసీ బాగుందని, అందుకే వైసీపీ శాసన సభ్యులు, మంత్రులు అందరూ కూడా దాని వల్లే కోటీశ్వరులు అయ్యారని బుచ్చయ్యచౌదరి అన్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వం కిందికి వెళ్ళిపోయిందని బుచ్చయ్య చౌదరి అన్నారు.


ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా, 'ముఖ్యమంత్రి డ్రింకింగ్ వాటర్ కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇచ్చారు. మరమ్మతులు అవసరమైతే అక్కడ చేసుకోవాలని శాసన సభ్యులను అడుగుతున్నాను', అని అన్నారు.

అదేవిధంగా ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. 'రాష్ట్రం మొత్తంలో ప్రాజెక్టులను 46 వేల కోట్లతో ప్రతిపాదనను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపాదనలలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళంలో ఉద్దానం, వాటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలను ఫస్ట్ ప్లేస్ లో తీసుకొని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది.' అన్ని ప్రసాద్ రావు మాటలకు సమాధానం చెప్పారు.

టిడిపి నేతలు ఏదో ఒక విమర్శ చేయాలనే ఉద్దేశంతో ఇసుక గురించి మాట్లాడుతున్నారని, ఫిల్టర్ల గురించి మాట్లాడుతున్నరని, ఈ కొత్త ఇసుక పాలసీ వలన వారికి డబ్బు సంపాదించడం కష్ట సాధ్యం అయిందని.. అందుకే అలా విమర్శలు చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభాముఖంగా తెలియజేశారు. వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ ఇసుక కొరత లేదని, అస్సలు ఇసుక  ఇబ్బంది లేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.

అదే విధంగా ఒక టిడిపి నేతని ఉద్దేశిస్తూ.. ఒక గోల్డ్ స్మిత్ చనిపోతే... ఆ గోల్డ్ స్మిత్ ఇసుక కొరత వలనే చనిపోయాడని ఆరోపణలు చేశాడని, ఎవ్వరు చనిపోయినా ఇసుక కొరత వలనేనని అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. అధ్వానంగా ప్రతిపక్షం విమర్శలు చేస్తూ.. ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదని  ప్రతిపక్ష పార్టీని దుయ్యబట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: