రాజకీయాల్లో వలసలు, పార్టీ ఫిరాయింపులు మామూలే. ఒకరకంగా చెప్పాలంటే పదవి, పలుకుబడి ఉంటేనే రాజకీయాల్లో గౌరవం ఇవి రెండు లేకుంటే కనీసం కారుకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి కూడా చులకనగా మాట్లాడుతాడు. ఇదెలా అంటే బెల్లం చేతిలో ఉంటే ఈగలు ముసురుతాయి. పదవిలో ఉన్నంత కాలం మన అనుకునే వారి సంఖ్య లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదు. పచ్చని చెట్టు మీదికే పక్షులు చేరుతాయి కాని ఎండిన చెట్టు దగ్గరుకి ఎవరు వెళ్లరు. పదవిలేని చంద్రబాబు పరిస్దితి ఇప్పుడు ఇలాగే ఉంది..

 

 

ఎందుకంటే చంద్రబాబు నే టీడీపీకి బలం, బలహీనత. ఇదేలా అంటే అధికారంలోకి వచ్చినప్పుడు నామమాత్రపు మంత్రులను పెట్టుకొని మొత్తం ఆయనే నడిపించే వారు. అందువల్లే ప్రస్తుతం టీడీపీలో రెండో శ్రేణి నాయకులు లేకుండా పోయారు. ఒక వైపు టీడీపీ దారుణ ఓటమిని ఖాతాలో వేసుకోవడం మరోవైపు బాబు గారికి వయస్సు మీద పడుతుండడంతో టీడీపీ పగ్గాలను భుజాన వేసుకునే యువ నాయకులు ఎవరూ లేక టీడీపీ శ్రేణులకు దిగులు పట్టుకుంది.

 

 

ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ పార్టీకి ప్రయోజనం కంటే కీడే ఎక్కువ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాబు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారిలో శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి, రోజా, కొడాలి నాని, త‌మ్మినేని సీతారాం మొదలకు ఇంకా చిన్నా చితక నాయకులు కూడా బాబుగారిని వాడుకుని ఇప్పుడు ఆడుకుంటున్నారు.

 

 

ఇకపోతే నలభై ఏళ్ల రాజకీయ అనుభవమున్న ఈయన ఇటు సొంత పార్టీ వారి అండలేక జనం ఆదరణలేక లేక ఏకాకిగా మిగిలి చిన్నబాబు ను చంకలేసుకుని తెలుగుదేశం అనే నావను ఒంటరిగా ఒడ్డుకు చేర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే గాయాల తాలుకు మంట తగ్గుతుందా ఇప్పుడు చంద్రబాబు పరిస్దితి ఇలాగే మారిందంటున్నారు ఏపీ ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: