దేశ రాజకీయాలలో యూట‌ర్న్ అనే పదం కరెక్టుగా అప్ట్ అయ్యేది చంద్రబాబుకి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రాల మధ్య పెట్టుబడులు రావాలంటే కచ్చితంగా స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్రానికి తప్పనిసరి. అటువంటి 2014 ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ విషయంలో చాలా నిర్లక్ష్యం వహించి స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ స్పెషల్ ప్యాకేజీ ఏపీకి ప్రకటించడం తో అసెంబ్లీ సాక్షిగా కేంద్రమంత్రి పై అభినందనలు కురిపించారు చంద్రబాబు.

 

కానీ అనూహ్యంగా ప్రజలలో స్పెషల్ ప్యాకేజీ బదులు స్పెషల్ స్టేటస్ వల్ల మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందని ఇదే తరుణంలో ప్రతిపక్ష నేత జగన్ కూడా ఫస్ట్ నుండి స్పెషల్ స్టేటస్ వస్తేనే ఏపీ మళ్లీ అభివృద్ధి చెందుతుందని గట్టిగా నిలబడటంతో అదే నినాదంతో ఎన్నికల్లో కూడా వెళ్లడంతో సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు యూట‌ర్న్ చేపట్టి స్పెషల్ స్టేటస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అనే నినాదం ఎత్తుకున్నారు. ఒక స్పెషల్ స్టేటస్ మాత్రమే కాదు అనేక విషయాలలో చంద్రబాబు గత పది సంవత్సరాల నుండి యూట‌ర్న్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. రైతు రుణమాఫీ విషయం మరియు అదే విధంగా ఇంటికో ఉద్యోగం విషయం ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు యూట‌ర్న్ అనేకసార్లు తీసుకోవటం జరిగింది.

 

దీంతో జాతీయ మీడియా స్థాయిలో కూడా చంద్రబాబు కి యూట‌ర్న్ ఏపీ పొలిటికల్ లీడర్ అనే ముద్ర పడిపోయింది. చివరాకరికి 2019 ఎన్నికల్లో అంతకుముందు 2014 ఎన్నికల్లో చంద్రబాబు వైపు మొగ్గు చూపిన ఆంధ్ర ప్రదేశ్ చాలా గట్టిగా యూట‌ర్న్ తీసుకుని సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టబెట్టి జగన్ ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. చివరాఖరికి కోలుకోలేని దెబ్బ పార్టీతో పాటు తన రాజకీయ జీవితానికి చంద్రబాబు యూట‌ర్న్ రాజకీయాల వల్ల తను తీసిన గోతిలో తానే పడినట్లయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: