టిక్ టాక్.....సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే క్రేజీ యాప్. చిన్నా లేదు పెద్దా లేదు అందరూ పిచ్చపిచ్చిగా ఈ యాప్ ను వాడేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే మనోళ్లు టిక్‌ టాక్ వినియోగంలో టాప్‌లో నిలిచారు. 

 

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయినా యాప్ టిక్ టాక్.  యువతను ఊర్రూతలు ఊపుతున్న ఈ యాప్...ఇప్పుడు ఇండియాను ప్రపంచంలోనే నెం 1గా నిలిపింది. టిక్ టాక్ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ టిక్ టాక్ మత్తులో పడి చెయ్యాల్సిన  పనులను కూడా మర్చిపోతున్నారు యూజర్స్. తిండి తిప్పలు పక్కన పెట్టేసి రోజు మొత్తం ఈ టిక్ టాక్ తోనే గడిపేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఈ టిక్ టాక్ తో ప్రపంచాన్నే మరచి పక్కవాళ్ల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

 

టిక్‌ టాక్ టిక్ టాక్ నువ్వు ఏం చేస్తావు..అని అడిగితే... నేను..భార్యభర్తల కాపురంలో చిచ్చు పెడుతా..ప్రేమికుల మధ్య గొడవ పెడుతా... కొత్త ప్రేమికులను కలుపుతా అన్నట్లు ఉంది వ్యవహారం. టిక్ టాక్ వల్ల కొందరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటుంటే, ఇంకొందరేమో రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. టీనెజ్ నుంచి మొదలుకొని వృద్ధుల వరకు టిక్ టాక్ కు బానిసలయ్యారు. ఇంత లెవెల్ లో పాపులర్ అయినా టిక్ టాక్ మొత్తానికి ఇండియాను ప్రపంచం ముందు నెంబర్ వన్‌ గా నిలిపింది. 

 

ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరానికిగాను 1.5 బిలియన్ల మంది ఈ ఆప్ ని డౌన్ లోడ్  చేసుకోగా ఒక ఇండియాలోనే 27 కోట్ల అరవై లక్షలకు చేరుకున్నాయి. ఇక ఓవరల్‌గా భారత్‌లో టిక్ టాక్ యూజర్ల సంఖ్య 46 కోట్ల 80 లక్షలకు చేరుకుంది. గత సంవత్సరం తో పోల్చుకుంటే, ఆరు శాతం డౌన్ లోడ్ లు  అధికమయ్యాయి. ఇక టిక్ టాక్ డౌన్‌లోడ్స్‌లో ఇండియా మొదటి స్థానంలో ఉండగా.. చైనా రెండవ స్థానంలో, అమెరికా మూడవ స్థానంలో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: