రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అన్ని సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు లావాదేవీలు జరిపే వీలు మాత్రమే ఉండేది. లేకపోతే ఎటిఎం దగ్గరికి వెళ్లి నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అరచేతి నుంచి ఎలాంటి నగదు బదిలీ చేయడానికైనా అవకాశం ఉంది . ప్రస్తుతం బ్యాంకులు ఏటీఎంల కు వెళ్లే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది దీనికి కారణం డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి రావడం. డిజిటల్  బ్యాంకింగ్ ద్వారా ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అరచేతి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ యాప్ లు  కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 

 

 

 

 కాగా  ఆన్లైన్ పేమెంట్ యాప్ లు  ఎన్ని వచ్చినప్పటికీ ఎక్కువమంది ప్రజలు వాడుతున్న ఆన్లైన్ పేమెంట్ యాప్ లు  మాత్రం పేటీఎం,  ఫోన్ పే,  గూగుల్ పే. ఈ మూడు ప్రతి యొక్క వినియోగదారుని స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి,  ఎక్కువగా వినియోగదారులందరూ వీటిని వినియోగిస్తున్నారు. అయితే ఈ మూడు ఆన్లైన్ పేమెంట్ యాప్ లలో ఎక్కువగా పేటీఎం వినియోగదారులను ఆకర్షించే ఆఫర్లను ప్రకటించి ఎక్కువ లావాదేవీలను పేటీఏం  ద్వారా చేసేందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. మంచి మంచి క్యాష్ బ్యాక్ లు  ప్రకటిస్తూ వినియోగదారులు పేటియం ద్వారా లావాదేవీలు చేసేందుకు ఆసక్తి చూపేలా చేస్తుంది పేటీఎం.దీంతో ఏ చిన్న పేమెంట్  అయినా ప్రస్తుతం పేటియం ద్వారానే పేరు చేస్తున్నారు చాలా మంది. 

 

 

 

 అయితే పేటీఎం మరోసారి తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే... ఆర్బిఐ కొత్తగా తీసుకొచ్చిన నెఫ్ట్ నిబంధనలతో పేటియం సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. పేటీఎం వినియోగదారులు అందరూ నెఫ్ట్ తో పాటు యూపీఐ ఐఎంపిఎస్ ద్వారా ఎప్పుడైనా డబ్బుని పంపుకునే సదుపాయం కల్పించింది పేటీఎం. పేటియం పేమెంట్ బ్యాంకు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వినియోగదారులు డబ్బులు పంపుకోవచ్చని  పేటియం తెలిపింది. అయితే పేటీఎం కి పోటీ గా ఉన్నా ఫోన్ పే గూగుల్ పే ల నుంచి కేవలం రెండు లక్షలు మాత్రమే పంపుకునేందుకు వీలుంది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేటీఎం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: