అదేంటో గాని కట్టెలమ్మిన చోట పువ్వులు అమ్మకూడదు. పువ్వులమ్మిన చోట కట్టెలమ్మకూడదు అంటారు పెద్దలు. కాని చంద్రబాబు పరిస్దితి ఇప్పుడు ఇలాగే కనిపిస్తుంది. ఆయన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు చాలా యాదృచ్చికంగా జరిగినట్లుగా అనిపిస్తుంది.. అందుకే అంటారు పైకి రాయి వేస్తే తిరిగి అది మన నెత్తినే పడుతుందని. ఇదిగో ఇప్పుడు చంద్రన్న పరిస్దితిని గమనిస్తే ..

 

 

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు.  2019 ఎన్నికల్లో  టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీకి 103 , వైసీపీకి 66 , బీజేపీకి 4, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

 

 

ఇదే విషయమై అసెంబ్లీకి కూడ వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకూడదని నిర్ణయం కూడ తీసుకొన్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ఎన్నికల ఫలితాలు కూడ మే 23వ తేదీనే వెలువడ్డాయి. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు పక్కన శనీశ్వరుడు కూర్చీ వేసుకుని కూర్చునట్లుగా అనిపిస్తుంది.

 

 

అందుకే ఏదైతే పొందాలని ఆశించాడో చివరికి ఆశించింది దక్కలేదు గాని మొదలుపెట్టిన పని చివరకు ఆయనకే చెందింది. ఇకపోతే బాబోరు గెలిచిన వెంట‌నే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి తీసుకున్నారు. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌ను లాక్కుంటే చివ‌ర‌కు జ‌గ‌న్ బాబోరికి అంత‌మందినే మిగిల్చాడు... ఇదే కావచ్చూ విధి విచిత్రమంటే అని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు

మరింత సమాచారం తెలుసుకోండి: