దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు మరొకరు లేరు ప్రధాని మోడీ కూడా నాకంటే జూనియర్ నాకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది నువ్వెంత నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఏమి చేయ లేక పోయారు అంటూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు దాదాపు నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వైసిపి పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై ఎటకారంగా మాట్లాడేవాళ్ళు. అయితే తన తండ్రి వైఎస్ చనిపోయిన నాటినుండి ప్రజలమధ్య ఉంటూ ముప్పుతిప్పలు పెట్టాడు అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాని మరియు చంద్రబాబుని. 2014 ఎన్నికల్లో అదృష్టం బాగుండి సోనియా ఓడిపోవడం జరిగింది. అయితే ఇదే తరుణంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాగాని ఎక్కడ కూడా జగన్ తలవంచిన దాఖలాలు లేవు.

 

చంద్రబాబుని అధికారంలో ఉన్న సమయంలోనే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా అధికారంలో చలామణి గా కొనసాగుతున్న సందర్భం లోనే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత రాష్ట్రం నుండి అమాంతంగా చంద్రబాబుపై తీసుకువచ్చే విధంగా ప్రత్యేక హోదా విషయంలో మరియు అదే విధంగా రైతు రుణమాఫీ విషయంలో ఇంకా చంద్రబాబు ఇచ్చిన అనేక హామీల విషయంలో  పాదయాత్ర చేస్తూ రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ని ముప్పుతిప్పలు పెట్టాడు 40 ఏళ్ల వయస్సు కలిగిన వైయస్ జగన్. ఒక విధంగా చంద్రబాబుకి చమటలు పట్టించిన ఏకైక రాజకీయ నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ అని అంటారు చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు.

 

ఎక్కడా కూడా వెన్ను చూపకుండా సూటిగా స్పష్టమైన రాజకీయాలు చేస్తూ 2019 ఎన్నికల్లో 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబుని... వైయస్ జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఒక్కొక్క అడుగుతో తెలుగుదేశం పార్టీపై ఉప్పెన లాంటి వ్యతిరేకత ప్రజల నుండి వచ్చే విధంగా అద్భుతమైన రాజకీయాన్ని తన దైన శైలిలో చేసి వన్ మాన్ ఆర్మీ గా చంద్రబాబు నాయుడుని మరియు తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టాడు. మొత్తంమీద చూసుకుంటే దాదాపు ఈ 10 సంవత్సరాలు ...నా 40 ఏళ్ల అనుభవం అంత వయసు నీకు లేదు అని సెటైర్లు వేసిన చంద్రబాబు ని 40 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు జగన్…. రాజకీయంగా చివరి స్టేజ్ లో తీసుకు వచ్చాడు దాదాపు రాజకీయంగా చంద్రబాబుని వైయస్ జగన్ సమాధి చేసినట్లే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: