ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లో ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సరిగ్గా ఆలోచిస్తే తెలంగాణ మిగులు బడ్జెట్ గల రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో ఉన్న పాలకులు అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగా చేయటంతో విభజన జరిగిన సందర్భంలో హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణకి వెళ్లిపోవడంతో లోటు బడ్జెట్ గల రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల తో మిగిలి ఉంది. ఇటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి మేలు చేకూరే విధంగా రాజకీయంగా ఆలోచించి అసలు ఏమాత్రం రాజధానికి అనుకూలంగా లేని ప్రాంతంలో అప్పటికే కొన్ని కమిటీలు ఆ ప్రాంతంలో రాజధాని పెడితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కోవటం గ్యారెంటీ అని నిపుణుల కమిటీ చెప్పినా గాని ఏ మాత్రం ఆలోచించకుండా చంద్రబాబు తన వర్గాలకు మేలు చేకూరే విధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అని గట్టిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం జరిగింది.

 

అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో విస్తారమైన వర్షాలు కురిసిన క్రమంలో చంద్రబాబు ప్రకటించిన అమరావతి ప్రాంతం మొత్తం వరద మయం అయింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అభివృద్ధి రాజధాని పేరిట కేవలం ఒక చోట మాత్రమే జరగకుండా అన్ని చోట్ల ఉండేటట్లు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరిగేలా ఏపీ రాజధాని విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

 

ముఖ్యంగా ప్రస్తుత 13 జిల్లాల రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్ర వెనుకబడిన ప్రాంతంగా ఎప్పటి నుండో ఉండటంతో ఆ ప్రాంతంలో అనగా విశాఖపట్టణంలో ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ అలాగే వెనుకబడిన రాయలసీమ లో కర్నూల్ ని ఆధారం చేసుకుని జుడిషియల్ క్యాపిటల్ రావాలని అలాగే అమరావతిలో పరిపాలనా కేంద్రంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఈ విధంగా అభివృద్ధి అంతట జరగాలని అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాన అభివృద్ధి కోసం జగన్ రాజధాని విషయంలో మూడు ప్రాంతాల్లో పెట్టడానికి రెడీ అవ్వబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో హైదరాబాద్ విషయంలో కోలుకోలేని దెబ్బ మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది. మళ్లీ అటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అంతటా అభివృద్ధి అంతటా రాజధాని అన్నట్టుగా జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: