ఒక కుర్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ విషయాలలో మరియు అదే విధంగా చదువు విషయంలో వైద్యం విషయంలో కుర్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను బట్టి అన్ని రకాలుగా సంతోషపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాజధాని విషయంలో కూడా ఈ కుర్ర ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు సమాన అభివృద్ధి చెందాలని ఎక్కడా కూడా ప్రజల మధ్య బేధాభిప్రాయాలు గతంలో తెలంగాణ-ఆంధ్ర అన్నట్టుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకూడదని రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడిన తీరు బట్టి అర్థం అవుతోంది.

 

విషయంలోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు చాలామంది మరియు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయడం మనం అందరం చూశాం. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిందో ఆ సమయంలో ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సరిగ్గా ఆలోచిస్తే తెలంగాణ మిగులు బడ్జెట్ గల రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో ఉన్న పాలకులు అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగా చేయటంతో విభజన జరిగిన సందర్భంలో హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణకి వెళ్లిపోవడంతో లోటు బడ్జెట్ గల రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల తో మిగిలి ఉంది.

 

ఇటువంటి నేపథ్యంలో తరువాత జరిగిన ఎన్నికలలో 2014వ సంవత్సరంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భం హైదరాబాద్ రీతిగానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రకటించడం జరిగింది. రాజధానిగా అమరావతి ప్రకటించడం సరైన నిర్ణయం కాదని అప్పట్లో నిపుణుల కమిటీ చెప్పడం జరిగింది. అయినా గాని చంద్రబాబు తన సామాజిక వర్గ ప్రజల కోసం వారి బాగోగుల కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారు అని ప్రత్యర్థి పార్టీల నాయకులు అంటారు. ఇటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జగన్ ఆంధ్రాకి ముఖ్యమంత్రి అవడం...యువకుడిగా ఉన్న జగన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు చోట్ల ఉంటే మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందటం గ్యారెంటీ అని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు చోట్ల విస్తరించనున్నట్లు జగన్ తనదైన శైలిలో అసెంబ్లీ సాక్షిగా చెప్పటం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: