మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబునాయుడు పూర్తిగా ఇరుక్కుపోయారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపికి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదంటూ కలకలం రేపారు. అంతే కాకుండా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్,  కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ ఉండవచ్చని  చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

జగన్ ఇలా ప్రకటన చేశాడో లేదో చంద్రబాబునాయుడుకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. కాసేపటికి తేరుకుని వెంటనే జగన్ ప్రకటనపై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అయితే  పై మూడు ప్రాంతాల ప్రజల నుండి చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. తమ ప్రాంతాల్లో రాజధానులు, హై కోర్టు ఏర్పాటుకు జగన్ ప్రయత్నిస్తుంటే మీరు అడ్డుకుంటారా అంటూ చంద్రబాబుపై జనాలు మండిపోతున్నారు. అలాగే పై రెండు ప్రాంతాల్లోని నేతలు కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలవలేకపోతున్నారు. ఇప్పటికే జగన్ ప్రతిపాదనకు గంటా శ్రీనివాసరావు మద్దతు పలకటం గమనార్హం.

 

దశాబ్దాల తరబడి పెద్దగా అభివృద్ధికి నోచుకోకుండా ఉత్తరాంధ్ర ఇబ్బందులు పడుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ది అంటే కేవలం విశాఖపట్నం నగరం అభివృద్దిగానే ఇప్పటి వరకూ కాలం గడిచిపోయింది. అలాంటిది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో వందల కోట్ల రూపాయలతో కిడ్నీ ప్రత్యేక ఆసుపత్రి, విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటి లాంటి వాటికి శంకుస్ధాపన చేశారు. ఇపుడు విశాఖపట్నంలో ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ అంటున్నారు.

 

అలాగే కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని దశాబ్దాల తరబడి పోరాటాలు జరుగుతోంది. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు జగన్ తమ కల నెరవేరుస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నాడని కర్నూలు జిల్లా ప్రజలు మండిపోతున్నారు. మొత్తానికి ఇంగ్లీషుమీడియంను వ్యతిరేకించి జనాల్లో ఎలా వ్యతిరేకతను తెచ్చుకున్నారో మూడు రాజధానుల విషయంలో కూడా అదే జరగబోతోంది.

 

ఇక్కడ చంద్రబాబు ఊహించని విధంగా ఎదురైన ఇబ్బంది ఏమిటంటే జగన్ ప్రకటనకు బిజెపి పూర్తిగా మద్దతు పలకటం. అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ప్రకటనను తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ప్రకటనతో  చంద్రబాబుకు మండిపోతోంది. ఇదే విషయమై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెబుతున్నా అంత సాహసం చేయకపోవచ్చు.  ఎందుకంటే జగన్ కు బిజెపి సపోర్టు ఇస్తున్నపుడు చంద్రబాబు ఏమి చేసినా చెల్లుబాటు కాదన్న విషయం అంతమాత్రం తెలీదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: