దిశ అత్యాచార ఘటన.. చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆ నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14 రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. 

 

ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 

 

కానీ ఆ నలుగురు నిందితుల ఇళ్లల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ నలుగురు నిందితుల కుటుంబాలు సోషల్ మీడియాలో అంత వైరల్ అవకపోయిన.. ఓక నిందితుడి కుటుంబం మాత్రం సంచలన వ్యాక్యలతో సంచలనం సృష్టించింది. ఆ నిందితుడు చెన్నకేసువులు తల్లి మాట్లాడుతూ.. తన రెండు ఎకరాల పొలం అమ్మి అయినా సరే ఎన్కౌంటర్ చేసిన పోలీసులను చంపేస్తా అని అంటే.. 

 

కోడలు.. చెన్నకేసువులు భార్య.. తన భర్తను ఎన్కౌంటర్ అన్యాయంగా చేశారని.. తనకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పియాలని, 15 లక్షలు నగదు ఇవ్వాలని సంచలనం సృష్టించింది. అలానే తన భర్తా చాలా మంచివాడు అని, మహ్మద్ అనే వ్యక్తి వల్లే తన భర్త ఆలా చేసి ఉంటాడని ఆమె అంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. 

 

అయితే ఇప్పుడు దిశ నిందితుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిశ ఉదంతానికి ముందు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు నిందితులు పై అనుమానం వ్యక్తం చేశారు. హైవేల పక్కనే అన్ని హత్యలు జరిగినట్టు గుర్తించారు. నిందితుల డిఎన్ఏతో పోలీసులు మిస్టరీ చేదించే ప్రయత్నం చేస్తున్నారు. తొమ్మిది హత్యలు చేసినట్లు వాగ్మూలంలో పేర్కొన్నారు. 

 

ప్రధాన నిందితుడు అయిన ఆరీఫ్ అలి ఆరు హత్యలు, చెన్నకేశవులు మూడు హత్యలు చేసినట్లు వాగ్మూలం చెప్పినట్లు సమాచారం. మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, కర్ణాటక, హైదరాబాద్ హైవేలపైనే ఈ దారుణాలు చేశారు అని, అన్నింటిలో లైంగికదాడి ఆపై హత్య చేసి పరారీ అయినట్టు, అన్ని హత్యలలో మృతదేహాలను కాల్చేడయం వీరి నేరప్రక్రియ అనిఎం  ఈ ప్రాంతాల్లో ఇప్పటికి 15 మంది మహిళలు హైవేలకు ఆనుకుని హత్యలు జరిగాయని, ఆ 15 మర్డర్ కేసుల్లో డిఎన్ఏ రిపోర్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

 

దిశ కేసులో కేస్ డైరీ వేసే సమయానికి ఈ కేసులని పోలీసులు చేధించాలనుకుంటున్నారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డిఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు అనుమానం. ఇన్ని అత్యాచారాలు, హత్యలు చేసి పారిపోయిన వాడు నీకు మంచోడా అంటూ ఒకరు ప్రధానిస్తే.. మరొకరు స్పందిస్తూ.. ఏవమ్మా నీ మొగుడు మంచోడు అన్నావ్.. దిశకు ముందు మూడు హత్యచారాలు చేశాడంట చూడు అంటూ నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: