రాజధాని విషయంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపికి  మూడు రాజధానుల సూత్రాన్ని ప్రతిపాదించినప్పటి నుండి రాష్ట్రంలో పెద్ద సంచలనం మొదలైంది. జగన్ ప్రతిపాదించాడు అంటే కచ్చితంగా వ్యతిరేకించే పార్టీలు, జనాలు ఎలాగు ఉంటారు కదా. జగన్ నోటివెంట ప్రతిపాదన రావటం ఆలస్యం చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడిపోతున్నారు. సిపిఎం నేతలు కూడా పూర్తి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

 

 సరే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంగతిని కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్న పవన్ మూడు రాజధానుల ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకించకుండా ఎలాగుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీలు, నేతల సంగతి ఎలాగున్నా మెజారిటి జనాలు మాత్రం జగన్ ప్రతిపాదనను  స్వాగతిస్తున్నారు.

 

అంతా బాగానే ఉంది అసలు జగన్ ప్రతిపాదించిన సౌత్ ఆఫ్రికా మోడల్ రాజధానులు ఏమిటి ?  ఏమిటంటే,  ఎగ్జిక్యుటివ్ రాజధానిగా ప్రిటోరియా ఉంది. జ్యుడిషియల్ రాజధానిగా బ్లూం ఫౌంటెన్, లెజిస్లేటివ్ రాజధానిగా కేప్ టౌన్  ఏర్పాటైంది. సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఎందుకు ఏర్పడింది ? ఎందుకంటే ఒకప్పుడు  ప్రపంచం మొత్తం మీద జాతి వివక్షత ఎక్కువగా ఉండేది సౌత్ ఆఫ్రికాలోనే.

 

నల్లజాతీయులకు, శ్వేతజాతీయులకు ఏమాత్రం పడేది కాదు. శ్వేతజాతీయుల దృష్టిలో నల్లజాతీయులు కేవలం బానీసలు మాత్రమే. ఇళ్ళల్లోను, కార్యాలయాల్లోను, ఫ్యాక్టరీలు, తోటలు, పొలాల్లో పనిచేయటానికి మాత్రమే నల్లజాతీయులను అనుమతించేవారు. ఇటువంటి దేశంలో కాలంతో పాటు పరిస్ధితుల్లో మార్పులు వచ్చినా జాతివివక్ష అయితే పోలేదు. ఇటువంటి నేపధ్యంలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.

 

అప్పుడు కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నపుడు రాజధానిగా ఏ నగరం ఏర్పాటు చేయాలనే సమస్య వచ్చింది. దేశం మొత్తం మీద నల్లజాతీయులే సంఖ్యాపరంగా మెజారిటి అయినా పాలనా వ్యవహారాలు, అధికారం మొత్తం శ్వేతజాతీయుల చేతుల్లోనే ఉండేది. రాజధానిని తమ ఆధిపత్యం ఉండే ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకునేందుకు తెల్లవాళ్ళు ప్రయత్నించినపుడు నల్లజాతీయుల్లో తిరుగుబాటు మొదలైంది.

 

దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు జరగటం, వందల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత చివరకు శ్వేతజాతీయులు దిగివచ్చారు. ఇరువర్గాలకు మధ్యే మార్గంగా మూడు రాజధానుల ఏర్పాటు ఒప్పందం జరిగింది. దాని ఫలితమే సౌతా ఆఫ్రికాకు మూడు రాజధానులు ఏర్పడ్డాయి. అదే మోడల్ ను జగన్ కూడా ప్రతిపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: