రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రౌడీలు నాయకులవుతారు. నాయకులు పెద్దపెద్ద స్కాం లు చేసే దోపిడి దారులవుతారు. రాజకీయం అంటే ఇలానే ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. ఇకపోతే ఒకప్పుడు తనపై రౌడీ షీట్ ఉండగా, ఇప్పుడు మారిపోయి ప్రజా సేవకు అంకితమయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు మళ్లీ రౌడీషీటర్ల జాబితాలో చేరింది. ఈ విషయం తెలిసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా స్పందించారు..

 

 

ఇకపోతే మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ల జాబితాలో రాజా సింగ్ పేరును చేర్చడం ఇప్పుడు వివాదస్పదం అవుతుంది. ఇంతే కాకుండా  దీనికి సంబంధించి ఓ పత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే, గతం లోనే తనపై ఉన్న రౌడీ షీట్‌ను పోలీసులు తొలగించారని, ఇప్పుడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనపై మళ్లీ రౌడీ షీట్ తెరిచారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

ఇది పోలీసుల నిజ స్వరూపం అని మండిపడ్డారు.. రౌడీషీటర్ల జాబితాలో నాపేరు చూసి బాధపడ్డాను. ప్రజాసేవ చేస్తూ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నన్ను రౌడీషీటర్‌ జాబితాలో చేర్చారు. తెలంగాణ పోలీసుల దృష్టిలో నేను ఎమ్మెల్యే కాదు..రౌడీ షీటర్‌. తెరాసలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకప్పుడు రౌడీషీటర్లే.

 

 

వారి పేర్లు రౌడీషీటర్ల జాబితాలో ఉన్నాయా? తెరాసలోని రౌడీషీటర్ల పేర్లు పెట్టే దమ్ము పోలీసులకు ఉందా? నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా ? ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారూ ..

 

 

ఇదే కాకుండా రౌడీ షీట్‌లో పేరు ఉన్నందున పోలీసులు పిలిచినప్పుడల్లా రావాలని, డీసీపీ అధ్వర్యంలో కౌన్సెలింగ్ ఉంటుందని పోలీసులు తెలిపారన్నారు. అయితే, దీనిపై సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: