ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు దేశవ్యాప్తంగా సంచలనాలు రేపుతున్నాయి. ఇటీవల దిశ యాక్ట్ సంచలన కరమైన చట్టం తీసుకువచ్చి ఎవరిపైనైనా అనగా ఆడవాళ్ళ పైన లైంగిక వేధింపులకు రేప్ లకు పాల్పడితే సదరు నిందితులకు 21 రోజుల్లో శిక్ష పడేలా జగన్ చట్టం తీసుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా లోకం మొత్తం సంతోషించగా దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదేవిధంగా ఒడిషా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల మరియు చట్టం అమలు అయ్యే విధానం పట్ల ఆకర్షితులవడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో మూడు రాజధానులు ఉండటం వలన రాష్ట్రమంతటా కొన్ని ప్రాంతాలలో సమన్యాయం సమాన అభివృద్ధి జరుగుతుందని చేసిన ప్రకటన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చాలా మంది జాతీయ రాజకీయ నాయకులు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ లెవెల్ లో చర్చ జరుగుతోంది.

 

ముఖ్యంగా వైజాగ్ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసిపి పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. ఇదే తరుణంలో రాయలసీమ ప్రాంతం కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాయలసీమ వాసులు ఇప్పటివరకూ వచ్చిన పరిపాలకులు అందరు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే జగన్ మరియు వాళ్ళ తండ్రి వైయస్ మాత్రమే సరైన న్యాయం చేశారని కర్నూలు ప్రాంతంలో హైకోర్టు రావటం నిజంగా హర్షణీయమని జగన్ పై పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు.

 

ఏది ఏమైనా జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...మూడు రాజధానుల నిర్ణయం పట్ల విపక్షాల నుండి వ్యతిరేకత వస్తుంటే మరోపక్క అన్ని ప్రాంతాల వాసులు నుండి మాత్రం అద్భుతమైన స్పందన వస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు జగన్ నిర్ణయంతో జగన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: