సమాజంలో రోజురోజుకి అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. దుర్మార్గులు చాలా తెలివిగా వ్యవహరిస్తూ పోలీసులకు దొరక్కుండా దారుణాలకు పాల్పడుతున్నారు, ఘటన స్థలిలో ఎటువంటి సాక్ష్యాధారాలను వదలడం లేదు. దీనితో పోలీసులు ఈ కేసులను ఛేదించాలంటే కష్టతరంగా మారింది. తాజాగా ఇలాంటి ఒక ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఏడు నెలల క్రితం మహారాష్ట్ర రాజధాని ఔరంగాబాద్ లో భికన్‌ నిలోబ జాదవ్‌ అనే వ్యక్తిని కొందరు దారుణంగా హత్య చేశారు.

 

ఘటనాస్థలిలో నిందితులు ఒక్క క్లూను కూడా వదిలిపెట్టలేదు. క్రైమ్ సీన్ ను జల్లెడ పట్టారు పోలీసులు అయినా ఒక్క క్లూ కూడా దొరకలేదు, ఒక చొక్కా గుండీ మాత్రమే ఘటన జరిగిన ప్రాంతంలో దొరికింది. ఈ చొక్కా గుండి సాయంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దొరికిన చొక్కా గుండి మీద రోప్‌ లాస్ట్‌ స్టిచ్‌ అని రాసి ఉంది. దీని ఆధారంగా పోలీసులు అటువంటి చొక్కాలు అమ్మే ఆన్‌లైన్ విక్రేతలను సంప్రదించి కొనుగోలుదారుల వివరాలను పొందారు. 

 

"మాకు 10,000 మంది కొనుగోలుదారుల వివరాలు వచ్చాయి, అందులో క్రిమినల్ నేపథ్యం ఉన్న 246 మందిని షార్ట్‌లిస్ట్ చేసాము. ఐదు రాష్ట్రాలకు చెందిన ఈ నిందితుల గురించి మా బృందాలు హత్య జరిగిన రోజు, అంతకు ముందు రోజు ఎక్కడ ఉన్నారనేదానిపై ఆరా తీసాం"అని ఎస్పీ మోక్షద పాటిల్ చెప్పారు. ఈ 246 మందిలో రగాడే అనే వ్యక్తి నేరానికి రెండు రోజుల ముందు రెండు కత్తులను కొన్నాడని పోలీస్ అధికారులు గుర్తించారు. రగాడేను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిందంతా చెప్పేసాడు. 

 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని సిలోడ్ నగరంలో వైన్ షాప్ ఉద్యోగి భికాన్ నీలోబా జాదవ్ (48) ను చోరీ చేసి హత్య చేసిన కేసులో అజయ్ గులాబ్రూ రాగాడే (30), చేతన్ అశోక్ గైక్వాడ్ (34), సందీప్ ఆశారామ్ గైక్వాడ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేసును కేవలం ఒక్క గుండీ సహాయంతో ఛేదించిన పోలీసులకు ప్రభుత్వం రూ 30,000 క్యాష్ ప్రైజ్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: