ఇటీవల నిర్భయ కేసు లోని ఒక నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించదన్న విషయం తెలిసిందే. గతంలో మిగతా ముగ్గురి నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించినది. దాంతో నిర్భయ నిందితుల కథ ముగిసినట్లేనని తెలుస్తుంది. అయితే బుధవారం కోర్టు లో అక్షయ్ తరుపున లాయర్, "నిర్భయ స్నేహితుడు డబ్బులు తీసుకుని టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు, అందుకే ఈ కేసులో ప్రధాన సాక్షి ప్రకటనలను నమ్మలేము" అని అన్నారు. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కానీ ప్రజలకు నిర్భయ స్నేహితుడు గురించి గుర్తుకు వచ్చింది.
ఆ సందర్భంలోనే.. ప్రతి ఒక్కరి మదిని.. 'నిర్భయ స్నేహితుడు ఎక్కడ?' అనే ప్రశ్న తోలిచివేసింది. అవును! ఎక్కడ? అదే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో అతని కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఇంతకుముందు మీడియా వాళ్లు వారి ఇంటికి ఎన్నిసార్లు వెళ్లినా.. మాట్లాడేందుకు ముందుకు రాలేదు. అయితే దోషులకు ఉరిశిక్ష  అమలు అయ్యే సమయంం దగ్గరలోనే ఉన్నందున వారు తమ నోరు విప్పారు. నిర్భయ స్నేహితుడు అవనీంద్ర ప్రతాప్ పాండే ప్రస్తుతం రహస్య జీవితం గడుపుతున్నారని వాళ్ల నాన్న భాను ప్రతాప్ పాండే చెప్పారు. తండ్రి ప్రతాప్ గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రసిద్ధ న్యాయవాదులలో ఒకరు. తను మాట్లాడుతూ... అవనీంద్ర మహారాష్ట్రలోని పూణేలో ఒక ప్రైవేటు సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ... పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని తెలియజేసాడు. నిర్భయ కేసులోని దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలని అవనీంద్ర కోరుతున్నాడని తండ్రి చెప్పారు.


2012, డిసెంబర్ 16 తారీఖు రాత్రి సమయంలో... నిర్భయ, ఆమె స్నేహితుడు అవనీంద్ర ప్రతాప్ పాండే ఇద్దరు కలిసి 'లైఫ్ అఫ్ ఫై' అనే ఒక అమెరికన్ సర్వైవల్ సినిమా ను దక్షణ ఢిల్లీ లోని ఒక థియేటర్ లో చూసారు. సినిమా చూసిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ద్వారకా లోని వారి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఒక బస్సు వారి వద్దకు వచ్చి ఆగింది. దాంట్లో డ్రైవర్ తో సహా మరొక 5గురు ఉన్నారు. ద్వారకలో దించుతాం బస్సు ఎక్కండని అనేక సార్లు అడిగి వారిని నమ్మించేవిధంగా చేసారు. దాంతో నిర్భయ, అవనీంద్ర ఆ బస్సు ఎక్కారు. కొంత సమయం తరువాత బస్సు లోని వ్యక్తులు అవనీంద్రని ఒక ఇనుప రాడ్ తో కొట్టి నిర్భయపై అఘాయిత్యం చేసారు. వారి క్రూరమైన పని అనంతరం ఇద్దరిని బస్సు నుంచి బయటకి తోసేశారు.


అప్పుడు నిర్భయ, అవనీంద్ర తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయారు. అలా ఉన్న వారిని బస్సు తో తొక్కిద్దామని బస్సుని నిర్భయ మీదకి తీస్కోచ్చారు. కానీ.. కొంచెం స్పృహతో ఉన్న అవనీంద్ర ఆమెను పక్కకి గట్టిగ లాగాడు. ఆపై దోషులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతమంది ప్రయాణికులు వీళ్లిద్దరి చూసి ఢిల్లీ పోలీసులకు తెలియచేసారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: