తెలంగాణ ప్రజల ఆశలు ఉద్యమంలా మారితే ఆ ఉద్యమం నుండి వచ్చిన నాయకుడు కేసీఆర్ అని అందరు అనుకుంటున్నారు. ఇకపోతే మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్.. ఇలా ఐదుసంవత్సరాల పదవి కాలాన్ని పూర్తిచేసి మరలా రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా ఏడాది దాటిపోయింది. రెండోసారి బంపర్ మెజార్టీతో మళ్లీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్... ఏడాది పాలనలో ప్రజలను ఎంతవరకు ఆకట్టుకున్నారనే దానిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.

 

 

అదేమంటే జనంలో టీఆర్​ఎస్​ ఏడాది పాలనపై అసంతృప్తి నెలకొందట.. కేసీఆర్ సర్కారు ఏడాది కింద 47 శాతం ఓట్లతో రెండోసారి అధికారంలోకి రాగా. పబ్లిక్ రిపోర్ట్ లో 38 శాతం మంది మాత్రమే ఈ ఏడాది కాలంలో పాలన బాగుందని చెప్పారు.  49 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 శాతం మంది యావరేజ్​గా ఉందన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వ పాలనపై ఓ తెలుగు దినపత్రిక సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం. తేలిందేమిటంటే టీఆర్ఎస్ అందరికంటే ముందు ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ పాపులారిటీ మాత్రం క్రమంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది.

 

 

ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపప్రతిపక్ష పార్టీలు బలం పుంజు కుంటుందని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ ఓటు శాతం 39.5గా నమోదైంది. కాంగ్రెస్ 26.2 శాతం, బీజేపీ 25.6 శాతం, ఎంఐఎం 2.4 శాతం, ఇతర పార్టీలు 1.6 శాతంగా నమోదైంది. ఇకపోతే ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ ప్రవర్తించిన తీరు చాలమందిని ఆలోచనకు  గురిచేసింది.

 

 

అంతే కాకుండా కొన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు బాగోలేదని జనం సూటిగా చెప్పారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో కార్మికులతో కేసీఆర్ వ్యవహారశైలి, చేసిన ప్రకటనలపై ఎక్కువమంది జనం అసహనం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా చాలావిషయాల్లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనే అపవాదులు ప్రజల్లోనుండి వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: