ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో సీఎం జగన్ అసెంబ్లీ లో మూడు చోట్ల రాజధాని ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్త పరచటం జరిగింది. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మరియు రాయలసీమ ప్రజలు అదే ప్రాంతంలో ఉన్న ఇతర ఇతర పార్టీల నాయకులు జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని అభివృద్ధి అనేది ఒక చోట మాత్రమే కాకుండా అన్ని చోట్ల జరిగితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు భవిష్యత్తులో విడిపోయే ఆలోచనలు రావని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలని జగన్ చెప్పిందే కరెక్ట్ అని మూడు రాజధానుల విషయంలో చాలా మంది నేతలు నాయకులు వైసిపి ప్రభుత్వం కి మద్దతు తెలుపుతున్నారు.

 

కానీ తెలుగుదేశం పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి నారాయణ స్పందించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఏమై పోతారు అని వారిని క్షోభకు గురి చేయవద్దని వైసిపి ప్రభుత్వం కి విజ్ఞప్తి చేశారు. తమ పై కక్షతో ప్రభుత్వం మూడు రాజదానులను తెరపైకి తెచ్చిందని నారాయణ ఆరోపించారు. అమరావతి వ్యవహారంలో తాము ఎవరం తప్పు చేసినా చర్య తీసుకోవచ్చని ప్రభుత్వానికి తెలియజేశారు.

 

అన్ని జిల్లాలకు సమ దూరంగా ఉంటుందన్న కారణంగానే అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. గతంలో జగన్ కూడా రాజదానికి ముప్పైవేల ఎకరాల భూమి కావాలని అన్నారని నారాయణ పేర్కొన్నారు. రైతులు తమ పిల్లల భవిష్యత్తు కోసం 58 రోజుల్లో 33వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని అన్నారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధానే ఉండాలని ఆయన చెప్పారు. వైసిపి నేతలు తనకు గతంలో మూడువేల ఎకరాల భూమి ఉందని అన్నారని, ఇప్పుడు ఏభై ఐదు ఎకరాలు అంటున్నారని ఇష్టానుసారంగా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: