హైదరాబాద్ షాద్నగర్ లో దిశా అనే  వైద్యురాలిని నలుగురు  పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. దిశా  కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే ఇలాంటి శిక్షలు విధించడం సరైనది అంటూ సమర్థిస్తే...  ఇంకొంత మంది నిందితుల ఎన్కౌంటర్ చట్ట విరుద్ధంగా జరిగింది అంటూ తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే దిశ నిందితులు ఎన్కౌంటర్లో వ్యతిరేకిస్తూ హై కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 

 

 అయితే హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపించింది హైకోర్టు. కాగా ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో నలుగురు నిందితులను మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలి  అనుకుంటున్నాం అని హైకోర్టు పేర్కొంది. అయితే దిశా కేసులోనీ  నిందితులు నలుగురికి ఇప్పటికే ఓసారి పోస్టుమార్టం నిర్వహించారు.. నలుగురు నిందితులకు రీ పోస్టుమార్టం  నిర్వహించనక్కర్లేదు  అని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తామని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తెలిపిన రీ  పోస్టుమార్టం విషయంలో ప్రభుత్వాన్ని అభిప్రాయం  అడిగి తెలుసుకుంటాను అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదించారు. రేపటి లోపు ప్రభుత్వం అభిప్రాయాన్ని హైకోర్టులో తెలపాలని ఆదేశించింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టు పోలీస్ వ్యవస్థ పనితీరును దేశం మొత్తం గమనిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

 


 కేసులోని నలుగురు నిందితులు మృతదేహాలను రిపోర్టు మాత్రం చేయనున్న నేపథ్యంలో... మృతదేహాల పరిస్థితిపై నివేదిక అందించాలని గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ ను ఆదేశించింది హైకోర్టు. అంతేకాకుండా శనివారం జరగబోయే విచారణకు సూపరిండెంట్ హాజరు కావలసిందిగా ఆదేశించినది  హైకోర్టు. ఇకపోతే కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ జరిగే 15 రోజులు అవుతుంది. కాగా  నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి భద్ర పరిచిన విషయం తెలిసిందే. మృతదేహాలు కుళ్ళి పోకుండా ఉండేందుకు ఎంబాజింగ్  ప్రక్రియను నిర్వహిస్తున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: