కొన్నేళ్ల క్రితం మానవుడు తిండి, నీరు లతో పాటు శృంగారం పై కూడా శ్రద్ధ పెట్టేవాడు. అందుకే అప్పట్లో భార్య భర్తల మధ్య పెద్దగా పొరపచ్చాలు వచ్చేవి కావు. అయితే రాను రాను మనిషి జీవనంలో రకరకాల మార్పులు చోటుచేసుకోవడం, అలానే తద్వారా పలు రకాల నూతన పోకడలు అలవర్చుకున్న మానవుడు, శృంగారాన్ని కేవలం ఒక సాధారణ చర్యగా అలవర్చుకున్నాడు. దానితో రాను రాను భార్య భర్తల మధ్య శృంగార పరంగా సరైన సఖ్యత సుఖం లేక, వారిలో ఒకరు సంతృప్తి చెందితే మరొకరు సంతృప్తి చెందకపోవడం జరుగుతోంది. 

 

దాని వలన కొందరు తప్పుడు సంబంధాలు పెట్టుకుంటూ తమ నిండు కాపురాలను కూలదోసుకుంటున్నారు. అయితే  భార్యాభర్తల మధ్య సంసార సుఖంలో అసలైన భావప్రాప్తికి సిసలైన మూలం ఒకటుందని, అది తెలుసుకుని కనుక భార్య భర్తను ఇద్దరూ తమ జీవితాన్ని సాగిస్తే, శృంగారంతో సహా అన్నివిధాలుగాను సుఖసంతోషాలతో జీవించవచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. ఇక అసలు విషయం ఏమిటంటే, ముందుగా దంపతులైన ఇద్దరు భార్య, భర్తల మధ్య ఉండవలసింది నమ్మకం అని, ఆ తరువాత ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అవగాహన, ఇక వీటన్నిటికంటే మరింత ముఖ్యమైనది ప్రేమ, అనురాగం అని అంటున్నారు. ముందుగా ఒకరి ఇష్టాలు మరియు అభిప్రాయాలు మరొకరు తెలుసుకుని వాటిని గౌరవించడం, 

 

పాటించడంతో పాటు ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు ప్రేమను ఏర్పరుచుకోవడం పెంచుకోవాలట. ఆ విధంగా ఒకరిపై మరొకరు ప్రేమను పెంచుకుని జీవితాన్ని కొనసాగిస్తే, సంసారం సుఖం సమయంలో ఒకరిపై మరొకరికి కోరికలు మరింతగా పెరుగుతాయని, తద్వారా ఇద్దరికీ సంతృప్తి కలిగే అవకాశం చాలావరకు ఉంటుందని అంటున్నారు. అలానే శృంగార సమయంలో ఇద్దరిలో ఎవరైనా సంతృప్తి చెందకపోతే ఏ మాత్రం సంకోచించకుండా ఆ విషయాన్ని బయట పెట్టగలిగితే, తదుపరి ఆ విధంగా జరుగకుండా తన భాగస్వామి వ్యవహరించేందుకు అవకాశం ఉంటుందట. కావున ఈ కొద్దిపాటి చిన్న పద్ధతులు అనుసరిస్తే శృంగారంలో చాలావరకు భావప్రాప్తి కలుగుతుందట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: