దేశం మొత్తం మీద సోనియమ్మ హవా ఉధృతంగా వీస్తున్న సమయంలో ఆమెకు ఎదురెళ్ళిన ఒకే ఒక్క మగాడు అందులోను తెలుగోడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అప్పట్లో సోనియాను ఢీ కొనాలని కనీసం కలలో కూడా తలచుకునే వాళ్ళు కాదు. 2004-1014 మధ్య దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  సోనియాగాంధి అంటే  మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ అన్న విషయం అందరికీ తెలిసిందే.  అలాంటి సోనియమ్మను ఓ వెంట్రుక క్రింద తీసేసిన తెలుగోడో జగన్.

 

తండ్రి, దివంగత సిఎం వైఎస్సార్ మరణం తర్వాత మృతిచెందిన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఇంటింటికి వెళ్ళి  పరామర్శించి ఓదార్చాలని  జగన్ అనుకున్నారు. ఓదార్పు యాత్రలకు ప్రణాళిక కూడా రెడీ చేసుకున్నారు. అయితే దానికి కాంగ్రెస్ నేతలు అడ్డంకులు సృష్టించారు. దాంతో నేరుగా  అధినేత్రి సోనియానే కలుసుకుని అనుమతి తీసుకోవాలని మొత్తం కుటుంబసభ్యులంతా కలిసి ఢిల్లీకి వెళ్ళారు.

 

అమ్మను కలుసుకున్నారు. విషయం మొత్తం వివరించారు. సోనియా కూడా సానుకూలంగానే విన్నారు. కాబట్టి ఓదార్పుయాత్రకు అనుమతి వస్తుందనే అనుకున్నారు. కానీ తెరవెనుక ఏం జరిగిందో ఏమో జగన్ ప్రతిపాదనను సోనియా తిరస్కరించారు. మళ్ళీ సోనియాను కలిసి కన్వీన్స్ చేద్దామని అనుకున్న జగన్ కు అవకాశం రాలేదు. తాము చెప్పినట్లే వినాలంటూ జగన్ కు ఆదేశాలొచ్చాయి.

 

దాంతో ఇక లాభం లేదనుకుని ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వకపోతే  తాను పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతానని జగన్ స్పష్టం చేశారు. అయినా ఢిల్లీ నాయకత్వం పట్టించుకోలేదు. దాంతో వేరే దారిలేక జగన్ పార్టీ నుండి బయటకు వచ్చేసి ఓదార్పాయాత్ర మొదలుపెట్టేశారు. దీన్ని ప్రిస్టేజ్ గా తీసుకున్న పార్టీ నాయకత్వం కూడా జగన్ ను బహిష్కరించింది.

 

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నాయకత్వాన్ని ధిక్కరించిన జగన్ పై అనేక కేసులు పెట్టారు. కాంగ్రెస్ కు చంద్రబాబునాయుడు తోడు కలిసాడు. ఇద్దరూ కలిసి ఆదాయానికి మించి ఆర్జన కేసులు పెట్టి విచారణ పేరుతో జైల్లో పెట్టారు.  సరే తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అందుకనే సోనియాను ఢీ కొట్టిన ఒకే ఒక తెలుగోడు అన్న పేరు జగన్ కు చిరస్ధాయిగా నిలిచిపోతుందనటంలో సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: