ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి గా  జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. నాటి ఆలోచనలతో కాకుండా నేటి తరం ఆలోచనలను పాలనలో భాగం చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వినూత్న  ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. నేటి తరానికి సంబంధించిన వాళ్ళు అధికారం చేపడితే పాలన ఎలా ఉంటుందో నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తండ్రి రాజశేఖరరెడ్డి అజెండాను ముందుకు నడిపిస్తూ ప్రజల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దృఢ సంకల్పం పట్టుదలతో సీఎంగా అవ్వాలని నిశ్చయించుకున్నా జగన్మోహన్ రెడ్డి.. ఎన్నో  ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగి చివరికి తన చిరకాల వాంఛ అయిన సీఎం పదవిని అధిష్టించారు. 

 

 

 కాగా నేడు జగన్ మోహన్ రెడ్డి తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత మొదటి సారి జగన్ మోహన్ రెడ్డి తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ వెల్లువెత్తాయి. ఇప్పటికీ వైసీపీ నేతలు అందరూ జగన్ ఇంటికి చేరుకొని ఆయనకు స్వయంగా బర్తడే శుభాకాంక్షలు తెలిపారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు జగన్ అభిమానులు నుండి కూడా సోషల్ మీడియాలో బర్త్ డే  విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

 

 

 తాజాగా టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్ డే  విషెస్ తెలిపారు. అంతకు ముందుగా దేశ ప్రధాని మోదీ సైతం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: