ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందుతారన ఉద్దేశంతో సమాన అభివృద్ధి రాష్ట్రమంతటా జరగాలన్న ముందుచూపుతో గతంలో హైదరాబాద్ విషయంలో నష్టపోయిన నష్టం మళ్లీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదని ప్రజల మధ్య భేదాభిప్రాయాలు కలగకూడదని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు అనుకూల, రియల్ ఎస్టేట్ వర్గాలు చాల విచారం వ్యక్తం చేస్తున్నాయని కన్నబాబు మండిపడ్డారు.

 

పేదల పొట్ట కొట్టి వారి పంటలు తగల బెట్టిన వారికే గొంతులో వెలక్కాయ పడినట్లయిందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన అమలులోకి వస్తే విశాఖపట్నం దేశంలోనే రెండవ ఆర్ధిక రాజధానిగా మారబోతుందని కన్నబాబు తెలిపారు. చంద్రబాబుకు రియల్ స్టేట్ మీద కన్న.. రియల్ ఎస్టేట్ మీదనే ప్రేమ అని ఎద్దేవా చేశారు. అమరావతి మీద ప్రేమ ఉంటే చంద్రబాబు హైదరాబాదులో ఎందుకు ఇళ్లు కట్టుకున్నాడని చంద్రబాబుకి అదిరిపోయే కౌంటర్ వేసాడు కన్నబాబు.

 

కేవలం తన సామాజిక వర్గానికి మరియు కొంతమంది తన అనుచర వర్గలకు మేలు చేకూరే విధంగా రాజధానిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కోరుకున్నారని… ఆ సమయంలో అమరావతి రాజధానిగా ప్రకటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజల భవిష్యత్తులో ఆలోచించకుండా తన సొంత నిర్ణయాలతో రాజధానిని ఏర్పాటు చేయాలని భావించారని వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు ఆరోపించారు. గత ఐదేళ్లలో ఆ రాజధానిని పూర్తి చేయకుండా మసిపూసి మారేడుకాయ చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. బహుబలి సినిమాలా గ్రాఫిక్స్ చేసి కథ నడిపించారని ఆయన ఎద్దేవా చేశారు. జీఎన్.రావు ఇచ్చిన నివేదిక మీద సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సానుకూత లభిస్తోందని కన్నబాబు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: