పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న వేళ ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు పెదవి విప్పారు. "భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత "అని ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీలో జరిగిన మెగా ర్యాలీలో తన ప్రసంగంలో భాగంగా చెప్పారు. పౌరసత్వ చట్టం సవరణపై పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. ప్రజా ఆస్తులను కాకుండా తన దిష్టిబొమ్మను తగలబెట్టాలని మోడీ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.

 

భారతదేశానికి రావాలనుకుంటున్న వారికి స్వాగతం చెప్పాలని మహాత్మా గాంధీ చెప్పారు. భారతదేశం యొక్క ప్రత్యేకత దాని వైవిధ్యంలో ఉంది, దీనిని నా ప్రభుత్వం దీనిని అర్థం చేసుకుంది. పౌరసత్వ చట్టం మరియు ఎన్‌ఆర్‌సి భారతీయ ముస్లింలకు ఎలాంటి విఘాతం కలిగించదు. కానీ వారు పాకిస్తాన్ జనాభా మొత్తానికి పౌరసత్వం ఇవ్వమని చెబుతున్నారు. ఇది ఎక్కడైనా జరుగుతుందా?. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, మత ప్రాతిపదికన బంగ్లాదేశ్‌లో హింసకు గురైన ప్రజలకు పౌరసత్వం ఇవ్వాలని అన్నారు. అదే మాట ఇప్పుడు మోడీ చెప్పినందుకు చెడ్డవాడు అయ్యాడా? అని మోడీ ప్రశ్నించారు.

 

నేను రెండుసార్లు ప్రధాని అయ్యానని వారు (ప్రతిపక్షాలు) నాపై కోపంగా ఉన్నారు. అయితే అలాంటి వారికి మోడిని ద్వేషించవచ్చని నేను చెప్పాలనుకుంటున్నాను, కాని భారతదేశాన్ని ద్వేషించవద్దు. ప్రజా ఆస్తిని తగలబెట్టడం మరియు పేదవాడి ఆటోను నాశనం చేయడం ఆపండి. పౌరసత్వ సవరణ చట్టం ఎవరి పౌరసత్వాన్ని కొల్లగొట్టడానికి కాదు. అసహాయక వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం దీని అర్థం. సుప్రీంకోర్టు ఆదేశించినందున మాత్రమే మేము అస్సాంలో ఎన్ఆర్సిని నిర్వహించాము. ముస్లింలందరినీ నిర్బంధ కేంద్రాలకు పంపుతామని కొందరు అర్బన్ నక్సల్స్ పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు నిజానికి అసలు డిటెన్షన్ సెంటర్లు దేశంలో లేవు అని మోడీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: