జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చిచ్చంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల విషయంలో సోదరుల మధ్య విభేదాలు మొదలైనట్లే అనిపిస్తోంది. జగన్ ను టార్గెట్ చేయటమే ఏకైక లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్  రాజకీయాలు చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అంశాల వారీగా  జగన్ కు జిందాబాద్ కొడుతున్నారు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో పవన్ విమర్శించని అంశమంటూ లేదనే చెప్పాలి. చంద్రబాబునాయుడును సంతృప్తి పరచటం కోసమే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిపోతోంది. అందరికీ తెలిసిపోతోందన్న విషయం పవన్ కు తెలిసినా ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఇపుడు జగన్ ను ఏ అంశాలపై పవన్ విమర్శలు చేస్తున్నారో ఇవే అంశాలపై చంద్రబాబు పాలనలో కనీసం నోరు కూడా ఎత్తలేదు.

 

మొన్నటిమొన్న తెలంగాణాలో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం గురించి పవన్ మాట్లాడుతూ 151 మంది ఎంఎల్ఏలను ఇస్తే ఏం చేస్తున్నారంటూ జగన్ ను ప్రశ్నించటమే పవన్ అజ్ఞానానికి హైలైట్.  దిశ చట్టం తేవటంలో జగన్ చొరవను చిరంజీవి అభినందించారు.  సినిమా ఫీల్డులో చాలామంది జగన్ కు చట్టం విషయంలో హ్యాట్సాఫ్ చెబితే  ప్రభుత్వానికి అభినందన  చెప్పటానికి పవన్ కు కనీసం  నోరు కూడా లేవలేదు.

 

ఇక తాజా విషయానికి వస్తే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని జగన్ అనుకున్నారు. అదే విషయాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఇపుడు జిఎన్ రావు కమిటి  సిఫారసులు కూడా ఇదే విధంగా ఉంది.  కమిటి కూడా మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గు చూపింది. ఇదే విషయమై పవన్, నాగుబాబు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్ ప్రతిపాదన  బ్రహ్మాండమంటున్నారు.

 

రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో  అభివృద్ధి జరగాలంటే  మూడు రాజధానులు ఉండాల్సిందే అని తాజాగా మీడియాతో చెప్పటం గమనార్హం. అంటే మెగా కాపౌండ్ లో జరుగుతున్నది చూస్తుంటే జగన్ విషయంలో మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు మొదలైనట్లే అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: