ప్రస్తుత కాలంలో మనిషి పలు విధాలుగా డిజిటల్ మాద్యమాలతో ముందుకు పోతున్నప్పటికీ, ఈ విధమైన డిజిటల్ పద్దతులను కొందరు నీచులు తప్పుడు పద్దతలకు వినియోగిస్తూ పలువురి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బు మాయం చేయడం వంటి తప్పుడు పనులు చేస్తూ జనాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఇక ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ నుండి దాదాపుగా 4 కోట్ల మంది యూజర్ల డేటాని కేంబ్రిడ్జ్ అనలిటికా వారు లీక్ చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిగా ఆ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా ధ్రువీకరించడం జరిగింది. 

 

అనంతరం డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, అందుకు గాను తమ ఫేస్ బుక్ సంస్థ తరపున క్షమాపణలు కూడా చెప్పారు అధినేత మరిక్ జుకర్ బర్గ్. ఇక అది మాత్రమే కాక ఏప్రిల్‌ లో కూడా దాదాపుగా 54 కోట్ల మంది, అలానే సెప్టెంబరులో ఏకంగా 41.9 కోట్ల మంది డేటా లీకఅయినట్టు కూడా పలు వార్తలు హల్ చల్ చేసాయి. అప్పటి నుండి అసలు ఫేస్ బుక్ ఏ మాత్రం సురక్షితం కాదని భావించిన పలు దిగ్గజ కంపెనీలు సైతం తమ ఫేస్ అకౌంట్స్ ని తొలగించడంతో పాటు ఇకపై వాటి ద్వారా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేం అని తేల్చి చెప్పాయి. 

 

ఇక వీటన్నిటి తరువాత కొద్దిరోజుల క్రితం మరొక్కసారి 26.7 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల ఐడిలు హ్యాక్ అయినట్లు పలు సోషల్ మీడియాలో నిన్నటి నుండి విరివిగా వార్తలు ప్రచారం అవడంతో, కొందరు నెటిజన్లు తమ ఐడిలు చెక్ చేసుకోగా, అది కొంతవరకు నిజమేనని తేటతెల్లం అయిందట. దీనితో అలర్ట్ అయిన ఫేస్ బుక్ యాజమాన్యం వారు, మరింత భద్రంగా ఫైర్ వాల్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు మిగతా యూజర్లంతా కూడా తమ డేటాలీక్‌ బారిన పడకుండా ఉండాలంటే, వెంటనే ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చాలని సూచించారు.  అందుకు గాను 'సెండ్‌ డేటా టూ సెర్చింజన్స్‌' అనే ఆప్షన్ ను డిజేబుల్ చేస్తే తమ డేటా భద్రంగా ఉంటుందని, లేకపోతే గోవిందే నని ఫేస్ బుక్ యాజమాన్యం సూచిస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: