ఒకప్పటి ఫోర్న్ స్టార్. ఇప్పటి సినిమా నటి సన్నీలియోన్ అంటే వేడెక్కని కుర్ర హృదయాలుంటాయా. సన్నీ పేరు వింటే చాలు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. ఎందుకంటే సన్నీలియోన్ ఎందరో మతులు పోగొట్టిన ఓ హాట్ స్టార్ అని తెలిసిందే. ఈమె నటించడమే కాదు, కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టింది. సన్నీకున్న ఫాలోయింగ్ చూస్తే ఓంట్లో నరం నరం గరం కావలసిందే.

 

 

ఇకపోతే అంత ఫాలోయింగ్ ఉన్నఈ భామ ఎప్పటికప్పుడు సినిమాలలో స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను తన సోయగాలతో ఊరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించు కుంది.  తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో సాంగ్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘటనల పట్ల స్పందిస్తూ మహిళలను ఉద్దేశించి వేధింపులను సహించకండి అని అంటోంది సన్నీ. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్‌గా ఉండే సన్నీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు.

 

 

మహిళ్లలు పనిప్రదేశాల్లో మీకు ఎదురయ్యే వేధింపులను సహించకండి అంటూ వీడియోను పోస్ట్ చేసింది సన్ని. పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఉన్న ఆ వీడియోలో సన్నీలియోన్ ఓ కంపెనీలో పనిచేసే ఆఫీసర్‌లా, మహిళలకు తొడ్పాటు అందించే పాత్రలో అదరగొట్టారు. సన్ని ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘పని చేసేచోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి. మాట్లాడండి’ మనో ధైర్యంతో మీ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఆలోచించుకోండి. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

 

 

కాగా ప్రస్తుతం ‘కోకో కోలా’ అనే హార్రర్‌ కామెడీలో సన్నీ నటిస్తోంది. దాంతో పాటు ‘రంగీలా’, ‘వీరమదేవి’ అనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ లోను నటిస్తోంది. ఇటూ రియాల్టీ షోలలో ప్రేక్షకులను అలరిస్తూ, సినిమాలలో బిజిగా ఉంటూనే, ఈ భామ ఓ వెబ్ సీరిస్ కోసం తెలుగు యువ హీరో నవదీప్‌తో రొమాన్స్ చేయనుందని టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: