విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న విశాఖ ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న పాల్గొననున్నారని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొని తెలిపారు.. ఈ సందర్భంగా జగన్ ఆ రోజు విశాఖ ఉత్సవం లో పాల్గొనడంతో పాటుగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు..

 

 

ఇకపోతే దేశానికి ముంబై ఎంత ముఖ్యమో.. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం అంత ముఖ్య నగరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఇక విశాఖ నగరానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అంతర్జాతీయంగా విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ పేరిగేలా విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. టూరిజం ప్రమోషన్లలో భాగంగా ఈ ‘విశాఖ ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రోజుకు లక్షల మంది పర్యాటకులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

 

 

ఇదే కాకుండా విశాఖ ఉత్సవాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహరెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరుకానున్నారని, మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇకపోతే ఈ ఉత్సవాలలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందించే విధంగా ‘విశాఖ ఉత్సవ్‌’ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ను, నెల్లూరులో కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

 

ఇక ఇదిలా ఉండగా విశాఖ జిల్లాను జగన్ డిసెంబర్ నెలలో మూడు సార్లు పర్యటించినట్లు. ఈ మూడు కూడా మూడు ప్రత్యేక సందర్భాలు. అవేంటంటే  జగన్ డిసెంబర్ 4న జరిగే నేవీ ఉత్సవాలలో పాల్గొనగా,  ప్రతీ  ఏటా నేవీ తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న నేవీ డే కి, ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధిగా వెళ్లారు. ఇకపోతే ఈ హోదాలో జగన్ కూడా ఫస్ట్ టైం నేవీ ప్రొగ్రాం లో పాలుపంచుకోవడం.. ఇక ఇప్పుడు విశాక ఉత్సవాల్లో పాలుపంచుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: