జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై  రాజధాని అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల జనాలు గోల చేస్తున్నారు. వరసుగా ఐదు రోజులుగా ఆందోళణలు జరుగుతున్నా చంద్రబాబునాయుడు మాత్రం ఎక్కడా అడ్రస్ కనబడలేదు. తన కలల రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులు ఇంత గోల చేస్తున్నా చంద్రబాబు మాత్రం ఎందుకు అక్కడికి వెళ్ళి వారి ఆందోళనల్లో పాలుపంచుకోవటం లేదు ?

 

ఇపుడిదే అంశం రాజధాని ప్రాంతంలోని ఓ సెక్షన్ జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయగానే చంద్రబాబు సహజంగానే తీవ్రంగా వ్యతిరేకించారు. మీడియా సమావేశాలు పెట్టిన తన వ్యతిరేకతను  పదే పదే బయటపెట్టారు. పనిలో పనిగా తన అజ్ఞాత పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఉసిగొల్పారు. దాంతో పవన్ కూడా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు.

 

టిడిపి నేత, తాడికొండ మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ కూడా ఓ రోజు వచ్చి ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. అలాగే జనసేన తరపున నాదెండ్ల మనోహర్, నాగుబాబు కూడా వచ్చి ఆందోళనకారులతో సమావేశమై మద్దతు పలికారు. ఇంతమంది ఆందోళనలకు మద్దతు పలుకుతున్నా మరి చంద్రబాబు మాత్రం ఇంతవరకూ అటువైపు ఒక్కసారి కూడా తొంగి చూడలేదెందుకుని ?

 

అధికారంలో ఉన్నంత కాలం తనమీద నమ్మకంతోనే భూములు ఇచ్చారని పదే పదే చెప్పుకున్నారు. తన మాటమీద నమ్మకంతో 35 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇవ్వటం ప్రపంచలోనే ఎక్కడా జరగలేదని తన భుజాలను తానే చరుచుకున్నారు. మరి రైతులు తనపై అంత ప్రేమ, నమ్మకం చూపించినపుడు చంద్రబాబు కూడా వాళ్ళపై అంతే ప్రేమ చూపాలి కదా ?  వాళ్ళు చేస్తున్న ఆందోళనలకు  మద్దతుగా తాను కూడా వెళ్ళి అక్కడే కూర్చోవాలి కదా ? 

 

ఎందుకు కూర్చోవటం లేదంటే నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటమే చంద్రబాబు నైజం కాబట్టి.  రాజధాని మార్చే విషయంలో  అమరావతి ప్రాంతంలోని కొందరు చేస్తున్న  ఆందోళనలకు మద్దతుగా నిలబడితే మిగిలిన వేలాది గ్రామాల్లోని జనాలు ఎలా స్పందిస్తారో అర్ధం చేసుకున్నారు కాబట్టే అటువైపు తొంగికూడా చూడలేదు. అందులోను తొందరలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలు  వస్తున్నాయి కదా. అందుకనే  వీళ్ళకు మద్దతిచ్చి మిగిలిన చోట్ల వ్యతిరేకతను పెంచుకోవటం ఇష్టం లేకే రాజధాని జనాలను గాలికొదిలేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: