బీజేపీ ముఖ్య‌నేత‌, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాగ్‌పూర్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సిటిజన్ అమెండ్ యాక్ట్ లేదా సీఏఏ) అమలుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. ఓ స్థానిక సంస్థ చేపట్టిన ఈ ర్యాలీకి బీజేపీతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌) కూడా మద్దతునిచ్చింది. ఈ సందర్భంగానే గడ్కరీ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుందని, నగదు కొరతే ఇందుకు కారణమన్న ఆయన వేగవంతమైన నిర్ణయాల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

 


ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. అంతకుముందు త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఇది 5 శాతంగా ఉన్నది. ద్రవ్యోల్బణం సైతం విజృంభిస్తుండగా, క్షీణించిన వినియోగ సామర్థ్యం ఆధారంగా దేశ వృద్ధిరేటు అంచనాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)సహా మూడీస్, ఫిచ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా తదితర రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ అంచనాలకు కోత పెడుతున్న సంగతీ విదితమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దేశ ఆర్థిక పరిస్థితులపై ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. జీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం చెబుతున్నా.. వాటి ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో పరిస్థితులు ఇలాగే దిగజారితే మందగమనం నుంచి మాంద్యంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోకతప్పదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఆర్థిక మేధావులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ నేప‌థ్యంలో దేశంలోని ప‌రిస్థితుల‌పై గ‌డ్క‌రీ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ‘నా ఇంట్లో సీనియర్ అధికారులతో మాట్లాడాను. దాదాపు రూ.89 వేల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పాను. ఏం చేయాలో సూచించలేదుగానీ.. వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం స్పష్టం చేశాను. దేశ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్నది. నగదు కొరత ఉన్నది. త్వరితగతిన నిర్ణయాలు అవసరం’ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: