దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ షాద్నగర్ లోని వైద్యురాలు దిశా  అత్యాచారం హత్య ఘటన లోని  నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కాగా  ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దిశా నిందితుల  ఎన్కౌంటర్పై మొదట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్కౌంటర్ తప్పు అని చట్టవిరుద్ధంగా ఎన్కౌంటర్ జరిగింది అని కొందరు ఆరోపిస్తే ఇంకొందరు మహిళలపై అత్యాచారాలు చేసే వారికి ఇలాంటి ఎన్కౌంటర్లు సరైన శిక్ష అంటూ ఆరోపించారు. ఇకపోతే దీనిపై విచారణ నిన్న హైకోర్టులో ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. 

 

 

 తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. దిశ నిందితుల మృతదేహాలను రీ  పోస్టుమార్టం చేయాలని భావించింది. ఇక తెలంగాణకు చెందిన వైద్యులపై తనకు నమ్మకం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి పోస్టుమార్టం చేయించింది హైకోర్టు. అనంతరం నిందితులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రీ పోస్టుమార్టం ప్రక్రియను ముగించారు ఢిల్లీ గేమ్స్ బృందం సభ్యులు . హైకోర్టు సూచించినట్లు గానే పోస్టుమార్టం చేస్తుండగా వీడియో ని చిత్రీకరించారు. 

 

 

 కాగా  రీ పోస్టుమార్టం సంబంధించిన వీడియో హైకోర్టుకు ఈరోజు చేయండి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్  ప్రత్యేక వైద్య బృందం పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికను కూడా హైకోర్టు రిజిస్ట్రార్ అందజేసింది. మరో వారం రోజుల్లో రీ పోస్టుమార్టం కు సంబంధించిన సమగ్ర నివేదికను అందించనున్నారు. ఇకపోతే నిన్న రీ  పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్  బృందం సభ్యులు... నిందితుల లో శరీరాల్లో ఎన్ని బుల్లెట్ గాయాలు ఉన్నాయో తెలియజేశారు. ఇక నిందితుల మృతదేహాలు అప్పటికే కుళ్ళిపోవడంతో.. హైకోర్టు ఆదేశాలతో నిన్న రీ  పోస్టుమార్టం నిర్వహించి నిందితుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: