ఈమధ్య రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉద్యోగాలు చేసి కష్టపడడం కంటే సాఫీగా దొంగతనాలు చేసి ఒకేసారి భారీగా సంపాదించొచ్చు అన్న భావనతో ఎంతోమంది దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. అయితే నేటి తరం దొంగల స్టైల్  కూడా మారిపోయింది  పోలీసులకు దొరక్కుండా దొంగతనం చేయడం ఎలా అనేది ముందుగా ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత దొంగతనం చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడ ఓ  జోబూ  దొంగ అలాగే దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు... కానీ విచారణలో పోలీసులకు ఆ జేబుదొంగ ఆస్తులు చూసి షాక్ అవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఈ స్టోరీ ఎంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. 

 

 

 

 ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా ఆర్ని  ప్రాంతానికి చెందిన తానెదర్  సింగ్ కుష్వా  అలియాస్ రాజు అని జోబు  దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎప్పుడూ చేతిలో బ్లేడుతో తిరుగుతూ జేబు దొంగతనాలు చేస్తూ ఉంటాడు రాజు. ఆ తర్వాత విచారణలో అతని బ్యాక్ గ్రౌండ్ చూసి లగ్జరీ లైఫ్ ను చూసి అవాక్కయ్యాడు పోలీసులు. ఏకంగా సికింద్రాబాద్ ఎస్పీ అనురాధ ఇతని  లైఫ్ స్టైల్ చూసి విస్తు పోయింది. చందానగర్  లోని ఓకే గేటెడ్  కమ్యూనిటీలో నెలకు 30 వేల అద్దె చెల్లిస్తూ రాజు నివసిస్తున్నాడు... ఇద్దరు పిల్లలకి లక్షల ఫీజులు చెల్లిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు. లెక్కలేనన్ని ఆస్తులు భవనాలు భార్యకు కిలో బంగారం పైగానే ఆభరణాలు  ఉన్నాయి. పోలీసులు విచారణలో భాగంగా ఈ జోబు దొంగ  ఇంటికి వెళ్లిన సమయంలో ఏకంగా 13 లక్షలు దొరికాయి. 

 

 

 

 అయితే ఇతడి నేరాల సంఖ్య నాలుగు వందలకు పైగానే ఉంది. చిన్న వయసులోనే స్వీట్లు విక్రయిస్తూ జీవనం గడిపిన రాజు ఆ తర్వాత గంజాయ్ అమ్మకం ఆ తర్వాత దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు. క్రమంగా బ్లేడ్తో జోబులు  కత్తిరించడం లో సిద్ధహస్తుడు అయ్యాడు. 2009 వరకు సంపాదించిన డబ్బుతో ఆగ్రా లో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఆ తర్వాత హైదరాబాద్ కు  వచ్చాడు. గత  నెల 26న బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద  రాజు  నిలబడి ఉండగా అనుమానం వచ్చిన ఆర్పిఎఫ్ పోలీసులు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా రాజు వారి దగ్గర నుంచి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో  బైక్ మీద నుండి కిందపడగా  రాజు ఎడమ చేయి విరిగిపోయింది బైక్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బైక్ను తీసుకునేందుకు రాజు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విషయమేమిటంటే ఆ బైక్ కూడా దొంగలించి లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: