వైసిపి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ముందు నుండి నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు కాస్త వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని వైయస్ జగన్ ప్రతిపాదించిన సందర్భంలో రఘురామకృష్ణంరాజు వైయస్ జగన్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. తెలుగు భాషలో విస్మరిస్తే ఏ ప్రభుత్వాన్ని ఊరుకునే ప్రసక్తి లేదని రఘురామకృష్ణంరాజు ఢిల్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన ప్రకటనకి విరుద్ధంగా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా బిజెపి పార్టీ నాయకులతో రఘురామకృష్ణంరాజు కాస్త ఎక్కువగా ఉండటంతో అనేక విభేదాలు కూడా రఘురామ కృష్ణంరాజు పార్టీ హైకమాండ్ మధ్య చోటు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

ఇటువంటి తరుణంలో చాన్నాళ్ల తర్వాత జగన్ కి అనుకూలంగా రఘురామ కృష్ణం రాజు ఇటీవల సరైన సమయంలో గొప్ప పని చేశారు. అదేమిటంటే జగన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సందర్భంలో మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. అమరావతి రైతులు ఆందోళన సహజమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని పూర్తిగా తరలించటం లేదన్న విషయాన్ని గుర్తించాలంటున్నారు. అమరావతి రాజధానితో పాటు విశాఖను కూడా రాజధానిగా ఉంటుందన్నారు.

 

రాజధాని మార్పులకు సంబంధించిన అంశం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందటంతో పాటు.. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు లేఔట్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం కూడా జరిగిందని ఇంత క్లారిటీగా ప్రభుత్వం ఉంటే ఇంకా ఆందోళనలు ఆ ప్రాంతంలో ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని రఘురామకృష్ణంరాజు సరైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: