భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఆర్థిక మందగమనం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులను కు కు దించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 10 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 4కు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో పలు బ్యాంకులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల విలీన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం పూర్తయితే బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని కేంద్రం భావిస్తోంది. 

 

 

 మూలధనం విలువల పరంగా ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాబోదని... ప్రపంచ స్థాయి నాణ్యత భద్రతతో కూడిన సాంకేతికతతో... చెల్లింపుల వ్యవస్థను నడిపించవచ్చు నని  ఆర్బీఐ చెబుతోంది. ఈ విషయాన్ని మంగళవారం నాడు విడుదల చేసిన 2018-19 వార్షిక నివేదికలో పేర్కొంది ఆర్బిఐ. ఇకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం పూర్తయితే కొన్ని బ్యాంకులు కనుమరుగుకానున్నాయి .మార్చ్  31 నాటికి బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయితే ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు లు కార్పొరేషన్ బ్యాంక్ లో విలీనం కానున్న నేపథ్యంలో ఆంధ్ర బ్యాంకు ఏప్రిల్ 1 నుంచి కనుమరుగుకానుంది. అయితే ఆంధ్రా బ్యాంకు విలీనంపై పలువురు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

 

 

 ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర బ్యాంకు ను వేరే బ్యాంకు లో విలీనం చేయడం సరి కాదని వేరే బ్యాంకులను ఆంధ్ర బ్యాంకు లో విలీనం చేసి ఆంధ్ర బ్యాంక్ ను  పటిష్టం చేయాలంటూ కేంద్రాన్ని కోరారు. ఇకపోతే కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం అవుతుండగా... కార్పొరేషన్ బ్యాంకులో  ఆంధ్ర బ్యాంక్,  యూనియన్ బ్యాంక్ఇండియన్ బ్యాంకు,  అలహాబాద్ బ్యాంకు విలీనం  అవుతున్నాయి. ఇక ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లు  పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం కానున్నాయి. దీంతో ఇండియా లోని రెండు అతిపెద్ద బ్యాంకులు  సృష్టించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: