తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి ని ప్రవేశ పెట్టినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం పౌరసత్వ సవరణ చట్టానిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

  తాజాగా పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ నీ  వ్యతిరేకించాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. యునైటెడ్ ముస్లిం ఫోరం తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ భేటీలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్,  షాషా ఖాద్రి సహా పలువురు పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టం బిల్లు పై వ్యతిరేకత తెలుపాలి అంటు  అసదుద్దీన్ ఓవైసీ కోరినట్లు తెలిపారు. దాదాపు ఈ భేటీ మూడు గంటల పాటు  సుదీర్ఘంగా సాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి నీ  వ్యతిరేకించాలని అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ విన్నపం పై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాము అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

 

 టిఆర్ఎస్ పార్టీకి మొదటినుంచీ ఎంఐఎం పార్టీ మిత్రపక్షమే  కావడంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విన్నపం పై మంత్రి కెసిఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ పై భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.పలు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి నీ  తమ రాష్ట్ర పరిధిలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు తమ  రాష్ట్ర పరిధిలో సిఏఎ, ఎన్ఆర్సి ని అమలు చేయబోమని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: