ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్ భవన్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని డిసెంబర్ 25 బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సహ వ్యవస్థాపకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి 95 వ జయంతి. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. భాజపా నేతలకు రక్షణ కల్పించేందుకు పోలీసు భద్రత సిబ్బంది ఉత్తర ప్రదేశ్ మొత్తం భారీగా మొహరించారు.


1991, 1996, 1998, 1999 మరియు 2004 లో వాజపేయి లక్నో పార్లమెంటరీ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటల్ బిహారీ వాజ్‌పేయి మెడికల్ యూనివర్శిటీకి పునాదిరాయి కూడా వేశారు, దీని కోసం 50 ఎకరాల భూమిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.



నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిమిషం పాటు వీడియో సందేశాన్ని పంచుకున్నారు. వాజ్‌పేయి మాటలు శక్తివంతమైనవని, అయితే అతని మౌనానికి మరింత శక్తి ఉందని అన్నారు. "అతనికి ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు చెప్పాలో తెలుసుకునే అద్భుతమైన శక్తి ఆయనకు ఉంది" అని మోడీ అన్నారు. మరొక ట్వీట్ లో ఈ దేశ ప్రజలు వాజ్‌పేయికి ఘనంగా స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు.


వాజపేయి జయంతి సందర్భంగా మాజీ ప్రధానిని జ్ఞాపకం చేసుకున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. "అటల్జీ జీవితం భావజాలం, సూత్రాలపై ఆధారపడింది. అతని జీవితంలో అధికారం పట్ల ఏనాడూ ఆశ లేదు. ఆయన నాయకత్వంలో దేశం మంచి పాలనను చూసింది" అని షా హిందీలో ట్వీట్ చేశారు.


ఇకపోతే, మాజీ ప్రధాని దివంగత ఎ. బి. వాజ్‌పేయి 1924, డిసెంబర్‌ 25న కృష్ణ దేవి, కృష్ణ బిహారీ వాజపేయి లకు జన్మించారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు ఆ తర్వాత 1999వ సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు ప్రధానమంత్రి బాధ్యతలను వహించారు

మరింత సమాచారం తెలుసుకోండి: