మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్న  విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక్కడ ఓ మహిళకు తన సహోద్యోగి నుండి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి ... దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. గత మూడేళ్ళ నుంచి పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ కేసు. అయితే ఈ కేసులో నిందితుడిగా  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాజాగా ఒక వింత పిటిషన్ ను  కోర్టులో దాఖలు. ఆడదాని గా మారిపోతున్నాను  అని.. తనను తాను చిన్నప్పటి నుంచి స్త్రీలాగానే  ఊహించుకున్నాను అని  కోర్టులో పిటిషన్ వేశాడు. 

 

 

 

 ఢిల్లీ హైకోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు స్త్రీలపై  ఎటువంటి మొహం లేదని.. కాబట్టి తనపై నమోదైనా లైంగిక వేధింపుల కేసును కొట్టేయండి అంటూ ఈ నిందితుడు  పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలితో రాజి  కుదుర్చుకున్నాను  అంటూ పిటిషన్లో పేర్కొన్నారు ఆ వ్యక్తి. అంతేకాదు విచారణ కోసం అతడు స్త్రీల దుస్తులు ధరించి మరీ కోర్టుకు హాజరు కావడం గమనార్హం. చిన్నప్పటి నుంచి తనని తాను స్త్రీ గానే భావించుకున్నానని .. ప్రస్తుతం తాను పూర్తిగా స్త్రీగా  మారే క్రమంలోనే ఉన్నాను అని కోర్టుకు తెలిపాడు ఆ వ్యక్తి. లైంగిక వేధింపులు చేశానంటూ తనపై ఫిర్యాదు చేసిన మహిళలు మొదటి నుంచి తాను ఒక సోదరి గానే భావించానని... కానీ ఆమె పై  మాత్రం తనకు ఎలాంటి మొహం  లేదని... తనపై ఉన్న కేసుల కొట్టివేయాలంటూ కోర్టును అభ్యర్థించాడు అనే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.

 

 

 

 అయితే లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులో ఈ వాదనలన్నీ వినిపిస్తున్న తరుణంలో బాధితురాలు కోర్టులోనే ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించిన బాధిత మహిళ అతని వాదనను తోసిపుచ్చింది. రాజీ పడే ఉద్దేశ్యం లేదని విచారణను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించాలని స్పష్టం చేసింది. అతనికి  తగిన శిక్ష విధించాలి అంటూ కోర్టును అభ్యర్థించింది బాధిత మహిళ. ఈ నేపథ్యంలో కోర్టు నిందితులకు వేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ అతని పిటిషన్ను కొట్టివేసింది. అయితే ఈ విచారణకు హాజరైన వారందరూ నిందితుడు తీరు చూసి అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: