జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై చంద్రబాబునాయుడు లేటెస్ట్ స్టాండ్ తీసుకోవటానికి కారణం ఏమిటి ? జగన్   ప్రకటన చేసిన మొదటి రెండు రోజులు  చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు.  తర్వాత అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా మెజారిటి జనాల అభిప్రాయాలనే తాను కూడా ఫాలో అవుతానని ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు జగన్ ప్రకటనపై ఎక్కడా నోరిప్పలేదు.  కానీ హఠాత్తుగా తన స్టాండ్ మార్చుకుని జగన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

ముందు వ్యతిరేకించి తర్వాత అనుకూలంగా ప్రకటించి మళ్ళీ మూడు రోజుల గ్యాప్ తర్వాత చంద్రబాబు ఎందుకు రెచ్చిపోతున్నారు ? అసలు ఆ మూడు రోజుల గ్యాప్ లో ఏమి జరిగింది ? ఇపుడిదే అంశంపై పార్టీ నేతల మధ్య చర్చ  జరుగుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సామాజికవర్గంలోని కీలక వ్యక్తులతో పాటు ఎల్లోమీడియా యాజమాన్యాలతో  చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరిపారట. దాని ఫలితంగానే  చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నారని అంటున్నారు.

 

జగన్ ప్రకటనపై మామూలుగానే చంద్రబాబు వ్యతిరేకించినా తర్వాత జనాగ్రహం చూసిన తర్వాత తప్పనిసరిగా  తన వైఖరి మార్చుకుని జై కొట్టారట. ఎప్పుడైతే జగన్ ప్రతిపాదనకు చంద్రబాబు జై కొట్టారో  ఎల్లోమీడియా యాజమాన్యాలకు షాక్ తగిలిందట.  జగన్ ప్రకటనకకు విరుద్ధంగా తమ మీడియాలో రాష్ట్రమంతటా పెద్ద ఉద్యమం జరుగుతోందన్నట్లుగా చూపుతున్న సమయంలోనే  చంద్రబాబు యూటర్న్ తీసుకోవటం యాజమాన్యాలకు మింగుడు పడలేదట.  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా

 

అందుకనే యాజమాన్యాలు చంద్రబాబు నిర్ణయంతో విభేదించినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు.  జగన్ విషయంలో  స్టాండ్ మార్చుకుంటే భవిష్యత్తులో ఎదురవ్వబోయే సమస్యలను చెప్పి యాజమాన్యాలు చంద్రబాబును భయపెట్టినట్లు సమాచారం. దాంతో మెజారిటి పార్టీ నేతల అభిప్రాయాలను పక్కనపెట్టేసి చంద్రబాబు మళ్ళీ జగన్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఇటువంటి కారణాలతోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉదయం అధికార వికేంద్రీకరణకు జై కొట్టి సాయంత్రానికి మాట మార్చారట. మొన్నటి ఎన్నికల్లో  ఎంత ప్రయత్నించినా టిడిపి ఓటమిని ఎల్లోమీడియా ఆపలేకపోయిన విషయం తెలిసీ మళ్ళీ వాళ్ళ దారిలోకే చంద్రబాబు వెళ్ళిపోయాడంటే పాపం.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: