ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు మనసులోనుండి అసలు విషయం బయటపకొచ్చేసింది.  అంటే చెప్పుకోవటానికి ఉపరాష్ట్రపతి అని తనకు క్రియాశీల రాజకీయాలతో సంబంధం లేదని బయటకు చెప్పుకుంటున్నా తెరవెనక కుల నేతలమంతా ఒకటే అన్న విషయాన్ని చాటి చెప్పేశారు. అందుకనే ఉదయం అధికార వికేంద్రీకరణ జరగాలన్న నోటితోనే  సాయంత్రానికి అభివృద్ధి మొత్తం ఒకేచోట ఉండాలని మాట మార్చారు.

 

రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టే కాదట చివరకు కేంద్రప్రభుత్వ సంస్ధలు కూడా ఒకేచోట ఉండాలని మనసులోని మాటను బయటపెట్టేశారు.  అధికార వికేంద్రీకరణ జరిగితేనే కానీ రాష్ట్రం అభివృద్ధి జరగదని ఓ కళాశాల కార్యక్రమంలో పాల్గొన్నపుడు చెప్పిన విషయాన్ని మరచిపోయినట్లున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి  చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియా అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలోనే అధికార వికేంద్రీకరణ విషయంలో వెంకయ్య మాట్లాడిన మాటలు జగన్ ను వ్యతిరేకిస్తున్న వారందిరికీ పెద్దగా షాకిచ్చాయి.  వెంకయ్య మాటలు జగన్ ను సపోర్టు చేసినట్లుగా ఉన్నాయి. దాంతో పార్టీల పరంగానే కాకుండా  సొంత  సామాజికవర్గంలోనే సంచలనంగా మారింది.

 

వెంటనే కులపెద్దలంతా మాట్లాడుకున్నట్లే అనిపిస్తోంది.  జగన్ చెబుతున్న మాటనే వెంకయ్య కూడా చెప్పటమంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇపుడు వెంకయ్య సాక్ష్యాత్తు ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నారు. కాబట్టి వెంకయ్య మాటలకు చాలా విలువుంటుంది. అందుకనే జగన్ వ్యతిరేకులందరూ ఏకమయ్యారు. వెంకయ్యతో మాట్లాడి ఒత్తిడి పెట్టినట్లే అనుమానం వస్తోంది.

 

అందుకనే సాయంత్రమయ్యేసరికి వెంకయ్య నాలుక మతపడిపోయింది. మీడియాతో మాట్లాడుతూ మాట మార్చేశారు. ముఖ్యమంత్రి, సచివాలయం, శాఖాధిపతులు, హైకోర్టు, అసెంబ్లీ, డిజిపి, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలతో పాటు చివరకు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను కూడా ఒకేచోట ఉండాలని చెప్పటమంటే ’బ్లడ్ ఈజ్ తిక్కర్ దేన్ వాటర్’ అన్న విషయాన్ని వెంకయ్య విషయంలో నిరూపణైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: