ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం ఉన్న విషయం తెలిసిందే. అయితే భారత దేశంలో చాలా మంది హిందువులు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాన్ని పీడ సమయంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. గ్రహణం సమయంలో ఎవరు వంటలు చేసుకోరు ఆహారాన్ని తీసుకోరు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని పూర్తిగా శుద్ధి చేసుకొని ఆహారాన్ని వండుకుని తింటారు. అయితే ఇది నాటి కాలం నుంచి వస్తున్న ఆచారం . అయితే నేటి రోజుల్లో ఈ ఆచారాన్ని అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పటికీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో ఆలయాలు  అన్నింటినీ మూసి వేస్తూ ఉంటారు. సూర్య గ్రహణం  పూర్తి అయిన తర్వాత ఆలయాల అన్నింటిని తెరిచి శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. 

 

 

 ఈ క్రమంలోనే నేడు సూర్య గ్రహణం సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోక్తంగా మూసివేశారు. అనంతరం శుద్ధి చేసి పూజలను ప్రారంభిస్తారు. అయితే అన్ని ఆలయాలను మూసివేసినప్పటికీ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం యదావిధిగా తెరుచుకొని ఉంటుంది. గ్రహణం సమయంలో కూడా శ్రీకాళహస్తి ఆలయంలో యధావిధిగా పూజలు కొనసాగుతూ ఉంటాయి. ఈ రోజు సూర్య గ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచి యథావిధిగా పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. 

 

 

ఇక గ్రహణం రోజు ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలకు  భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయితే ఇది శుభపరిణామమని శ్రీకాళహస్తి పూజారులు కూడా తెలుపుతున్నారు. అయితే సాధారణంగా గ్రహణ సమయంలో అన్ని ఆలయాలను మూసివేసినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం మాత్రం గ్రహణ సమయం లో నూ తెరిచి ఉంటుంది. దీంతో శ్రీకాళహస్తి ఆలయం తో పాటు.. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం పాదగయ క్షేత్రం ను కూడా భక్తులు పూజలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు. అయితే పూర్వ కాలం నుండి ఈ పద్ధతిని పాటిస్తున్నామని వెల్లడించారు ఆలయ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: