సమాజంలో పెళ్లి అయిన వాళ్ళు మరి పెళ్లి కాని వాళ్ళు చిత్ర విచిత్రంగా ప్రస్తుత రోజుల్లో ప్రవర్తిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మానవ విలువలు సమాజంలో రోజురోజుకి తగ్గిపోతున్నాయి. విషయంలోకి వెళితే తాజాగా ఒక పెళ్లి కాని అమ్మాయి వేరే ఆడదాని మొగుడిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి చేయమని పోలీస్ స్టేషన్లో కూర్చోవటం జరిగింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న వస్తువులను మొత్తం కిందపడేసి పిచ్చి పిచ్చి గా ప్రవర్తించింది. హైదరాబాదులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది అయితే పెళ్లి అయిన వ్యక్తి తనకు ప్రియుడు అని తనతో పెళ్లి చేయాలని తనని తీసుకురావాలి అంటూ పోలీస్ స్టేషన్లో గట్టి గట్టిగా అరుపులూ అరవడంతో వెంటనే పోలీసులు తీసుకువస్తామని ఆమెకు మాట ఇచ్చి ఆమెను శాంతి పరిచారు.

 

వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి(22)కి కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లోని ఓ టెక్ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్‌తో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకుందామని చెప్పింది. అయితే అతను వివాహితుడు కావడంతో ఆ యువతితో మాట్లాడటం మానేశాడు. అంతేకాకుండా ఉద్యోగం కూడా మానేసి నట్లు సమాచారం. దీంతో సదరు యువతి ఆ వివాహితుడు ఇంటికి వెళ్లి మీ కొడుకుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది అంతే కాకుండా ఇంట్లో గొడవకు దిగింది.

 

చుట్టుప్రక్కల వారు మొత్తం అంతా రావడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు ఆ యువతితో పాటు అతని తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లటం జరిగింది. అయితే తల్లిదండ్రులు తమ కొడుకు కి పెళ్లి అయిపోయింది అని పోలీసులకు తెలపడం జరిగింది. కానీ సదరు యువతి మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేసింది. అంతే కాకుండా తన తలను గోడకు బాదుకుని పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను కంగారు పెట్టింది. దీంతో పోలీసులు ఆ వివాహితుడు ని పోలీస్ స్టేషన్ కు రప్పిస్తామని చెప్పడంతో ఆమె శాంతించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: