ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని విభజనతో నష్టపోయినా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంతటా జరగాలంటే వికేంద్రీకరణ కచ్చితంగా జరగాలని అభివృద్ధిలో ప్రతి ప్రాంతానికి చెందిన పౌరులు భాగస్వామ్యం కావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే జగన్ ఈ ప్రకటన చేశారు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు ప్రజలు వైయస్ జగన్ ప్రభుత్వం పై మరియు అదే విధంగా ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆర్కే పై తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేస్తూ అమరావతి ప్రాంతంలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

 

అయితే ఈ ప్రకటన నేపథ్యంలో ఆ సందర్భంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని రోజులు కనబడటం లేదని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు మరియు ప్రజలు చేసిన ఫిర్యాదు గురించి తాజాగా మూడు రాజధానులు ప్రకటన తర్వాత మొట్టమొదటి సారి కనిపించి ఎమ్మెల్యే ఆర్కే స్పందించాడు. విషయంలోకి వెళితే ఇటీవల మహానాడులో వంగవీటి మోహన రంగా వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే. రంగా విగ్రహనికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించి…. తాను కనపడటంలేదని రైతులు చేసిన ఫిర్యాదుపై స్పందించారు.

 

మా అన్నయ్య కుమారుడి వివాహ కార్యక్రమం ఉన్నందునే నేను మంగళగిరిలో లేను. నాలుగు రోజుల ఊరులో లేకపోతే రాజకీయాలు చేయడం తగదు. తాను రైతుల పక్షాన నిలిచి వ్యక్తిని. గతంలో అనేక పోరాటాలు చేసిన విషయం గుర్తు ఉంచుకోవాలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా కచ్చితంగా నిలిచి ఉంటుంది.గత 40 సంవత్సరాల నుంచి కుప్పంలో చంద్రబాబు కనపడటంలేదని అక్కడి ప్రజలు ఆయనపై ఫిర్యాదు చేశారు ముందు దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా రాజధానిపై తాడేపల్లి లో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని ఎమ్మెల్యే ఆర్కే క్లారిటీ ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: